జీహెచ్ఎంసీ యాక్షన్..
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో రాత్రి కురిసిన భారీ వర్షానికి భాగ్యనగరం మళ్లీ తడిసి ముద్దయ్యింది. పలుచోట్ల చెరువుల కట్టలు తెగడంతో నగరంలోని రహదారులు నదులను తలపిస్తున్నాయి. చాలా చోట్ల రాకపోకలు నిలిచిపోగా జీహెచ్‌ఎంసీ రంగంలోకి దిగింది. వరద ప్రాంతాల్లో సాధారణ స్థితులు తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు. వాటిని కమిషనర్, జోనల్ కమిషనర్లు మానిటరింగ్ చేస్తున్నారు. రోడ్లపై నిలిచిన నీటిని క్లియర్ చేస్తూనే, చెత్తాచెదారం […]
దిశ, వెబ్‌డెస్క్ :
హైదరాబాద్‌లో రాత్రి కురిసిన భారీ వర్షానికి భాగ్యనగరం మళ్లీ తడిసి ముద్దయ్యింది. పలుచోట్ల చెరువుల కట్టలు తెగడంతో నగరంలోని రహదారులు నదులను తలపిస్తున్నాయి. చాలా చోట్ల రాకపోకలు నిలిచిపోగా జీహెచ్‌ఎంసీ రంగంలోకి దిగింది. వరద ప్రాంతాల్లో సాధారణ స్థితులు తెచ్చేందుకు చర్యలు చేపట్టింది.
మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు. వాటిని కమిషనర్, జోనల్ కమిషనర్లు మానిటరింగ్ చేస్తున్నారు. రోడ్లపై నిలిచిన నీటిని క్లియర్ చేస్తూనే, చెత్తాచెదారం తొలగిస్తున్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా మురుగు ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లుతున్నారు.