బల్దియాలో లాక్‌డౌన్ కండీషన్స్ తెలుసా!

దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రమంతా గ్రీన్ జోన్‌గా ప్రకటించింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీలో పాటించాల్సిన నిబంధనలపై కమిషనర్ లోకేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సరి, బేసి పద్ధతిలో దుకాణాలు తెరిచేందుకు, వినియోగదారులు భౌతిక దూరాన్ని పాటించడం కోసం ఏర్పాటు చేసిన మార్కింగ్‌ను కమిషనర్ మలక్ పేట ఏరియాలో సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ సూచనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. మాల్స్‌, రెస్టారెంట్లు, ప‌బ్స్‌, బార్లు, సినిమాహాళ్లు […]

Update: 2020-05-19 10:04 GMT

దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రమంతా గ్రీన్ జోన్‌గా ప్రకటించింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీలో పాటించాల్సిన నిబంధనలపై కమిషనర్ లోకేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సరి, బేసి పద్ధతిలో దుకాణాలు తెరిచేందుకు, వినియోగదారులు భౌతిక దూరాన్ని పాటించడం కోసం ఏర్పాటు చేసిన మార్కింగ్‌ను కమిషనర్ మలక్ పేట ఏరియాలో సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ సూచనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. మాల్స్‌, రెస్టారెంట్లు, ప‌బ్స్‌, బార్లు, సినిమాహాళ్లు మూసే ఉంటాయని స్పష్టం చేశారు. కంటైన్‌మెంట్ జోన్‌లోని షాపుల‌న్నీ మూసివేస్తామని, ఇతర ప్రాంతాల్లో నిబంధనల ప్రకారం వ్యాపారాలు నిర్వహించుకోవచ్చని చెప్పారు. దుకాణాల్లో ప‌నిచేస్తున్న వారితో పాటు వినియోగదారులు కూడా మాస్కులు ధరించాలని సూచించారు. ‘ నో మాస్కు, నో గూడ్స్‌, నో స‌ర్వీస్’ నిబంధ‌న‌ను క‌చ్చితంగా పాటించాలని, మాస్క్ ధరించని వారికి రూ.వెయ్యి జరిమానా విధిస్తామని ఆయన హెచ్చరించారు. నాలుగు అడుగుల భౌతిక దూరం అమ‌లుకు ఫుట్ మార్కింగ్ చేయడంతో పాటు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్ వ‌ద్ద హ్యాండ్ శానిటైజ‌ర్ స‌దుపాయం ఏర్పాటు చేయాలని వ్యాపారులకు సూచించారు. ఈ నెల 31వ వ‌ర‌కు నిబంధ‌న‌లు వ‌ర్తిస్తాయ‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేష్ కుమార్ వివరించారు.

Tags:    

Similar News