పాతబస్తీలో దేవ్ బంద్ ప్రార్థనలపై ఆరా !

దిశ, హైదరాబాద్: కొవిడ్ -19 ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురి చేస్తోంది. కరోనా వైరస్ విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రార్థనలకు వెళ్ళొచ్చిన వారి నుంచే వ్యాపించినట్టుగా ప్రభుత్వం ఇప్పటి వరకూ భావించింది. కానీ, కొత్తగా ఉత్తర ప్రదేశ్‌లోని దేవ్ బంద్ ప్రాంతంలో నిర్వహించిన ప్రార్థనలకు హాజరైన ఆదిలాబాద్ జిల్లావాసులకూ కరోనా పాజిటివ్ తేలడంతో తాజాగా యూపీ దేవ్ బంద్, రాజస్థాన్‌లోని అజ్మీర్ ప్రాంతాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ముస్లిం జనాభా […]

Update: 2020-04-13 08:20 GMT

దిశ, హైదరాబాద్: కొవిడ్ -19 ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురి చేస్తోంది. కరోనా వైరస్ విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రార్థనలకు వెళ్ళొచ్చిన వారి నుంచే వ్యాపించినట్టుగా ప్రభుత్వం ఇప్పటి వరకూ భావించింది. కానీ, కొత్తగా ఉత్తర ప్రదేశ్‌లోని దేవ్ బంద్ ప్రాంతంలో నిర్వహించిన ప్రార్థనలకు హాజరైన ఆదిలాబాద్ జిల్లావాసులకూ కరోనా పాజిటివ్ తేలడంతో తాజాగా యూపీ దేవ్ బంద్, రాజస్థాన్‌లోని అజ్మీర్ ప్రాంతాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ముస్లిం జనాభా అధికంగా ఉండే హైదరాబాద్ నగరం నుంచి కూడా దేవ్ బంద్, అజ్మీర్ ప్రార్థనలకు వెళ్ళొచ్చారా అనే కోణంలో ప్రభుత్వ అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగా సోమవారం పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ, పోలీసులు పలువురి ఇండ్లకు వెళ్లి వివరాలను సేకరించారు. అయితే, ఇప్పటి వరకు దేవ్ బంద్, అజ్మీర్ ప్రాంతాలకు ప్రార్థనలకు వెళ్ళొచ్చిన వారు తమ దృష్టికి రాలేదని అధికారులు వెల్లడించారు.

Tags: covid 19, hyderabad old city, delhi nizamuddin, uttar pradesh deoband, ajmer

Tags:    

Similar News