GHMC చెత్త టిప్పర్ కిందపడి వ్యక్తి మృతి

దిశ, బేగంపేట: జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. ఈ విషాద ఘటన మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. బాలంరాయికి చెందిన ఎర్రా నరసింహారెడ్డి(56) ఇసుక వ్యాపారం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో పని ముగించుకుని తన బైకుపై ఇంటికి వెళ్తున్నాడు. ఎస్పీరోడ్ మీదుగా వెళ్తుండగా ప్లాజా జంక్షన్‌ ప్రాంతంలో జీహెచ్‌ఎంసీ చెత్తను తరలించే టిప్పర్ వాహనం వేగంగా వచ్చి వెనుక నుంచి […]

Update: 2021-11-22 08:46 GMT

దిశ, బేగంపేట: జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. ఈ విషాద ఘటన మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. బాలంరాయికి చెందిన ఎర్రా నరసింహారెడ్డి(56) ఇసుక వ్యాపారం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో పని ముగించుకుని తన బైకుపై ఇంటికి వెళ్తున్నాడు. ఎస్పీరోడ్ మీదుగా వెళ్తుండగా ప్లాజా జంక్షన్‌ ప్రాంతంలో జీహెచ్‌ఎంసీ చెత్తను తరలించే టిప్పర్ వాహనం వేగంగా వచ్చి వెనుక నుంచి అతని పక్కనుంచి దూసుకెళ్లాడు. అదే సమయంలో ఆయన ద్విచక్ర వాహనాన్ని ఎడమ వైపుకు తీసుకునేందుకు యత్నించగా అక్కడ నీటితో నిండి ఉన్న గుంతలో బైకు చిక్కుకుంది. దీనికి తోడు టిప్పర్ వెనుక భాగం అతనికి తగిలింది. దీంతో టిప్పర్‌ రెండు చక్రాల మధ్య పడి అక్కడికక్కడే మరణించాడు. వెంటనే మహంకాళి పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి గాంధీ మార్చురికీ తరలించారు.

Tags:    

Similar News