సోషల్ మీడియాను ఉపయోగించుకోండి
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రస్తుత సమయంలో సోషల్ మీడియా ఫ్లాట్ఫారాలను సమర్థవంతంగా ఉపయోగించుకొని ప్రజల సమస్యల పరిష్కరించాలని జీహెచ్ఎంసీకి ఎంఏయూడీ సూచింది. రాష్ట్రంలో విధించిన పది రోజుల లాక్డౌన్ కాలంలో అమలు చేయాల్సిన నిబంధనలపై మున్సిపల్ శాఖ బుధవారం మార్గ నిర్ధేశకాలు జారీ చేసింది. ఈ నెల 12 ఉదయం 10 గంటల నుంచి 22వ తేదీ ఉదయం 6 గంటల వరకూ లాక్ డౌన్ అమల్లో ఉండనున్న నేపథ్యంలో ప్రభుత్వ విభాగాలు చేపట్టాల్సిన చర్యలపై […]
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రస్తుత సమయంలో సోషల్ మీడియా ఫ్లాట్ఫారాలను సమర్థవంతంగా ఉపయోగించుకొని ప్రజల సమస్యల పరిష్కరించాలని జీహెచ్ఎంసీకి ఎంఏయూడీ సూచింది. రాష్ట్రంలో విధించిన పది రోజుల లాక్డౌన్ కాలంలో అమలు చేయాల్సిన నిబంధనలపై మున్సిపల్ శాఖ బుధవారం మార్గ నిర్ధేశకాలు జారీ చేసింది. ఈ నెల 12 ఉదయం 10 గంటల నుంచి 22వ తేదీ ఉదయం 6 గంటల వరకూ లాక్ డౌన్ అమల్లో ఉండనున్న నేపథ్యంలో ప్రభుత్వ విభాగాలు చేపట్టాల్సిన చర్యలపై ఆయా విభాగాధిపతులకు సూచనలు ఇచ్చింది.
కొవిడ్ విధుల్లో ఉన్న ఉద్యోగులు, సిబ్బంది పూర్తి స్థాయిలో హాజరయ్యేలా చూడాలని ఆదేశాల్లో ఎంఏయూడీ పేర్కొంది. మిగిలిన సిబ్బందిని 33% చొప్పున విధులు నిర్వహించాలని సూచించింది. అన్ని ఆఫీసుల ఎంట్రన్స్ ల వద్ద శానిటైజర్లు, హ్యాండ్వాష్లో అందుబాటులో ఉంచాలని సూచించింది. కార్యాలయాల్లోనూ, పరిసరాల్లోనూ భౌతిక దూరం అమలు చేయడంతో పాటు అత్యవసరంగా పూర్తి కావాల్సిన పనులకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని పేర్కొంది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలోని స్విమ్మింగ్ ఫూల్స్, జిమ్స్, సినిమా హాల్స్, క్లబ్స్, పార్కులు పూర్తిగా మూసివేయనున్నారు.