ఈసీని ఎవరూ చేతిలో పెట్టుకోరు : మేయర్

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల కమిసన్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అని జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ… ఎన్నికల కమిషన్‌ ఎవరూ చేతిలో పెట్టుకునే ఆస్కారం ఉండదని తెలిపారు. ఎన్నికల సందర్భంగా ట్రేస్ అవుట్ కాని, బోగస్ ఓట్లను తొలగించడం సాధారణ ప్రక్రియ అని సూచించారు. పాతబస్తీని తాము ఎమ్ఐఎం పార్టీకి అప్పజెబుతామని ఆరోపించడం సరికాదని అన్నారు. బీజేపీ నేతలు ప్రజల్లో గందరగోళం సృష్టించాలనుకుంటున్నారని […]

Update: 2020-11-09 09:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల కమిసన్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అని జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ… ఎన్నికల కమిషన్‌ ఎవరూ చేతిలో పెట్టుకునే ఆస్కారం ఉండదని తెలిపారు. ఎన్నికల సందర్భంగా ట్రేస్ అవుట్ కాని, బోగస్ ఓట్లను తొలగించడం సాధారణ ప్రక్రియ అని సూచించారు. పాతబస్తీని తాము ఎమ్ఐఎం పార్టీకి అప్పజెబుతామని ఆరోపించడం సరికాదని అన్నారు. బీజేపీ నేతలు ప్రజల్లో గందరగోళం సృష్టించాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో అల్లకల్లోలం సృష్టించాలనుకుంటున్నారని విమర్శించారు. బీజేపీ విధానం ఏంటో ప్రజలకు అర్ధం అవుతోందని అన్నారు.

Tags:    

Similar News