అధికార పార్టీకి మినహాయింపులా..?

గ్రేటర్ హైదరాబాద్‎లో అనుమతి లేని ఫ్లైక్సీలు, బ్యానర్లపై ఉక్కుపాదం మోపుతున్న జీహెచ్ఎంసీ.. అధికార పార్టీ విషయంలో కాస్తా వెనక్కి తగ్గింది. బ్యానర్లపై ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం ప్రత్యేకంగా యాప్ రూపొందించి మరీ.. అనుమతిలేని వాటికి జరిమానాలు విధిస్తూ వస్తోంది. నాలుగు నెలల కాలంలో ఏకంగా రూ. 30 కోట్ల జరిమానాలు విధించిన బల్దియా అధికారులు.. అందులో రూ.15 కోట్లు ప్రజల నుంచి వసూలు చేశారు. అయితే, ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా […]

Update: 2020-02-17 11:04 GMT

గ్రేటర్ హైదరాబాద్‎లో అనుమతి లేని ఫ్లైక్సీలు, బ్యానర్లపై ఉక్కుపాదం మోపుతున్న జీహెచ్ఎంసీ.. అధికార పార్టీ విషయంలో కాస్తా వెనక్కి తగ్గింది. బ్యానర్లపై ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం ప్రత్యేకంగా యాప్ రూపొందించి మరీ.. అనుమతిలేని వాటికి జరిమానాలు విధిస్తూ వస్తోంది. నాలుగు నెలల కాలంలో ఏకంగా రూ. 30 కోట్ల జరిమానాలు విధించిన బల్దియా అధికారులు.. అందులో రూ.15 కోట్లు ప్రజల నుంచి వసూలు చేశారు. అయితే, ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నగరంలో పలు చోట్ల అధికార పార్టీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అధికారులు పట్టించుకోనట్లు కనిపిస్తోంది.

కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. యూసఫ్‌గూడ ఏరియాలో మాగంటి గోపినాథ్ బ్యానర్లతో చౌరస్తాలను నింపివేశారు. ఈవీడీఎం విభాగంకు కిలోమీటర్ దూరంలోనే తలసాని శ్రీనివాస్ యాదవ్ రోడ్డు మధ్యలో భారీగా ఫ్లైక్సీలను ఏర్పాటు చేశారు. నగరంలో పలు చోట్ల చోటా, మోటా టీఆర్ఎస్ నాయకులకు కేసీఆర్ జన్మదిన వేడుకల కోసం ఏర్పాటు బ్యానర్లు వందల్లో ఉండొచ్చు. అయితే, వీటిపై బల్దియా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

రూల్ ప్రకారం ఇలాంటి ఫ్లెక్సీలపై జరిమానా విధించడంతో పాటు వెంటనే తొలగించాలనే నిబంధన ఉంది. మూడు రోజుల క్రితం నెక్లెస్‌రోడ్‌లో మంత్రి తలసాని ఏర్పాటు చేసిన కటౌట్‌కు రూ.5 వేల జరిమానా విధించిన అధికారులు దానిని వెంటనే తొలగించారు. ఈ విధానం ఇప్పటికీ అమలు చేయాల్సి ఉన్నా.. కనీసం ఆ జరిమానా విధించే సాహసం కూడా చేయలేకపోయారు. దీంతో పలువురి నుంచి విమర్శలు వస్తున్నాయి. సామాన్యుల ముక్కు పిండి వసూళ్లు చేసే జీహెచ్ఎంసీ.. అధికార పార్టీని పట్టించుకోదా..? అంటూ నిలదీస్తున్నారు.

Tags:    

Similar News