ప్రారంభమైన ఎన్నికల ఓట్ల లెక్కింపు
దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్ననికే గ్రేటర్ ఫలితాలు తేలిపోనున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా, మొదట పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ పూర్తి చేయనున్నారు. అనంతరం బ్యాలెట్ బాక్సుల లెక్కింపు జరుగనుంది. మొత్తం 150 డివిజన్లకు 30 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. 30 సర్కిళ్లలోని 30 ప్రదేశాల్లో లెక్కింపు కేంద్రాల కోసం 150 హాళ్లను సిద్ధం చేశారు. ప్రతి హాల్‌లోనూ 14 టేబుళ్లు ఏర్పాటు […]
దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్ననికే గ్రేటర్ ఫలితాలు తేలిపోనున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా, మొదట పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ పూర్తి చేయనున్నారు. అనంతరం బ్యాలెట్ బాక్సుల లెక్కింపు జరుగనుంది.
మొత్తం 150 డివిజన్లకు 30 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. 30 సర్కిళ్లలోని 30 ప్రదేశాల్లో లెక్కింపు కేంద్రాల కోసం 150 హాళ్లను సిద్ధం చేశారు. ప్రతి హాల్‌లోనూ 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌పై 1000 ఓట్ల లెక్కింపు వంతున ఒక రౌండ్‌లోనే 14 వేల ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. బల్దియా బరిలో 1,122 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.