ఈయన దగ్గరికి పోతే ఆయన.. ఆయన దగ్గరికి పోతే ఈయన
దిశ, హైదరాబాద్: కరోనా లక్షణాలు ఉన్నాయా? అయితే డీసీ దగ్గరకు వెళ్లి చెప్పండని ఏఎంఓహెచ్.. తీరా డీసీ వద్దకు వెళ్లి చెబితే ఏఎంఓహెచ్ వద్దకే వెళ్లండి. ఇది అధికారుల తీరు. జీహెచ్‌ఎంసీ సర్కిల్ -14 పరిధిలో ఇద్దరు అధికారులు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వైరస్ అనుమానితులు ఉన్నారని మొత్తుకున్నా ఆ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో చివరికి డివిజన్ టీఆర్ఎస్ పార్టీ నాయకుల సహాయంతో స్థానిక యూపీహెచ్‌సీ వైద్యుల వద్దకు వెళ్లి సమస్యను విన్నవించడంతో అంబులెన్స్ […]
దిశ, హైదరాబాద్: కరోనా లక్షణాలు ఉన్నాయా? అయితే డీసీ దగ్గరకు వెళ్లి చెప్పండని ఏఎంఓహెచ్.. తీరా డీసీ వద్దకు వెళ్లి చెబితే ఏఎంఓహెచ్ వద్దకే వెళ్లండి. ఇది అధికారుల తీరు. జీహెచ్‌ఎంసీ సర్కిల్ -14 పరిధిలో ఇద్దరు అధికారులు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వైరస్ అనుమానితులు ఉన్నారని మొత్తుకున్నా ఆ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో చివరికి డివిజన్ టీఆర్ఎస్ పార్టీ నాయకుల సహాయంతో స్థానిక యూపీహెచ్‌సీ వైద్యుల వద్దకు వెళ్లి సమస్యను విన్నవించడంతో అంబులెన్స్ ఏర్పాటు చేసి సదరు అనుమానిత రోగులను కింగ్ కోఠి ఆస్పత్రకి తరలించారు.
చర్యలు తీసుకోవాలి
జాంబాగ్ డివిజన్ పరిధిలోని ట్రూప్ బజార్‌లో రిక్షా తొక్కుతూ జీవనం వెళ్లదీస్తున్న ఓ తండ్రీకొడుకులకు కరోనా లక్షణాలు ఉండడంతో వారికి వైద్య పరీక్షలు చేయించాలని స్థానికులు జీహెచ్ఎంసీ సర్కిల్ ఏఎంఓహెచ్ డాక్టర్ శివకుమార్ వద్దకు వెళ్లి కోరగా ఆయన పట్టించుకోకుండా డీసీ వినయ్ కపూర్ వద్దకు వెళ్లాలని సూచించారు. తీరా డీసీ వద్దకు వెళితే ఏఎంఓహెచ్ వద్దకే వెళ్లాలని చెప్పడంతో వారికి ఏం చేయాలో పాలు పోలేదు. దీంతో అక్కడి నుంచి యూపీహెచ్‌సీ వైద్యుల వద్దకు వెళ్లి చెప్పడంతో వారు స్పందించి వెంటనే అనుమానితులిద్దరిని అంబులెన్స్ లో హాస్పిటల్‌కు తరలించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు జైశంకర్ జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులను కోరారు.