గంటా ఆగ్రహం.. సీఐడీ ఆఫీస్‌కు వెళ్లి వివరాలు ఆరా తీస్తా

దిశ, ఏపీ బ్యూరో: ప్రభుత్వంపై అభ్యంతరకర పోస్టులను సోషల్ మీడియాలో షేర్ చేశాడంటూ నలంద కిషోర్ ను సీఐడీ అధికారులు అరెస్టు చేయడంపై టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో నేటి తెల్లవారుజామున నలంద కిషోర్ ను తీవ్రవాదులను అరెస్టు చేసినట్టు అరెస్టు చేశారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో వాక్ స్వాతంత్రం హక్కు ప్రతి పౌరుడికి ఉందని గంటా శ్రీనివాసరావు చెప్పారు. 60 ఏళ్లు దాటిన నలంద కిషోర్ ను అప్రజాస్వామిక […]

Update: 2020-06-22 23:38 GMT

దిశ, ఏపీ బ్యూరో: ప్రభుత్వంపై అభ్యంతరకర పోస్టులను సోషల్ మీడియాలో షేర్ చేశాడంటూ నలంద కిషోర్ ను సీఐడీ అధికారులు అరెస్టు చేయడంపై టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో నేటి తెల్లవారుజామున నలంద కిషోర్ ను తీవ్రవాదులను అరెస్టు చేసినట్టు అరెస్టు చేశారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో వాక్ స్వాతంత్రం హక్కు ప్రతి పౌరుడికి ఉందని గంటా శ్రీనివాసరావు చెప్పారు. 60 ఏళ్లు దాటిన నలంద కిషోర్ ను అప్రజాస్వామిక రీతిలో అరెస్టు చేయడం భావ్యం కాదని గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. వైయస్సార్సీపీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టినా వారిపై రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉందని గంటా స్పష్టం చేశారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఆపేయాలని సూచించారు. సీఐడీ ఆఫీస్ కి వెళ్లి వివరాలు ఆరా తీస్తామన్నారు.

Tags:    

Similar News