నిజాం కాలం నాటి ఆనకట్ట పేరు మార్పు

దిశ, మెదక్: మెదక్ జిల్లాలో ఏకైక మధ్య తరహా ప్రాజెక్టు అయిన ఘనపూర్ ప్రాజెక్టు.. ఇక వనదుర్గ ప్రాజెక్టుగా మారనుంది. ఈ మేరకు ఏడుపాయల దేవస్థానం అమ్మవారి పేరును నామకరణం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొల్చారం మండలం చిన్నఘనపూర్ వద్ద మంజీరా నదిపై 0.135 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో 1905 లో ఘనపూర్ ఆనకట్టను నిర్మించారు. మెదక్, హవేలిఘనపూర్, కొల్చారం, పాపన్నపేట మండలాల్లో 21625 ఎకరాల ఆయకట్టు ఉంది. ఆనకట్టకు సమీపంలో ప్రసిద్ధిగాంచిన వనదుర్గామాత కొలువుదీరింది. […]

Update: 2020-08-12 04:51 GMT

దిశ, మెదక్: మెదక్ జిల్లాలో ఏకైక మధ్య తరహా ప్రాజెక్టు అయిన ఘనపూర్ ప్రాజెక్టు.. ఇక వనదుర్గ ప్రాజెక్టుగా మారనుంది. ఈ మేరకు ఏడుపాయల దేవస్థానం అమ్మవారి పేరును నామకరణం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొల్చారం మండలం చిన్నఘనపూర్ వద్ద మంజీరా నదిపై 0.135 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో 1905 లో ఘనపూర్ ఆనకట్టను నిర్మించారు. మెదక్, హవేలిఘనపూర్, కొల్చారం, పాపన్నపేట మండలాల్లో 21625 ఎకరాల ఆయకట్టు ఉంది.

ఆనకట్టకు సమీపంలో ప్రసిద్ధిగాంచిన వనదుర్గామాత కొలువుదీరింది. ఆలయ సందర్శనకు వచ్చిన భక్తులు తప్పకుండా ఈ ప్రాజెక్టును సందర్శిస్తారు. శివరాత్రి సమయంలో జరిగే జాతర, దసరా ఉత్సవాల సందర్భంగా దిగువకు నీటిని వదులుతారు. 2014లో ముఖ్య మంత్రి కేసీఆర్ ఆనకట్టను సందర్శించి.. ఆధునికీకరణకు నిధులను విడుదల చేశారు. ప్రాజెక్టు పరిధిలో మహబూబ్ నహర్, ఫతేనహర్ కాలువల సీసీ పనులు కొంత పూర్తికాగా, ప్రస్తుతం ఆనకట్ట ఎత్తు పెంపు పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నిజాం కాలంలో నిర్మించిన ఆనకట్టకు అమ్మవారి పేరు పెట్టారు. ఈ మేరకు ఎమ్మెల్సీ శేరిసుభాస్ రెడ్డి ప్రగతిభవన్ లో ముఖ్య మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News