జార్జ్ ఫ్లాయిడ్‌కు కరోనా

వాషింగ్టన్: అమెరికాలో పోలీసుల దురుసు ప్రవర్తన కారణంగా ప్రాణాలు కోల్పోయిన జార్జ్ ఫ్లాయిడ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. పోలీసు మోకాలితో నొక్కడం వల్లే మరణించాడని పోస్టుమార్టం రిపోర్టులో వెలువడింది. అంతేగాకుండా అతడి రక్త నమూనాలను పరీక్షించగా అప్పటికే జార్జ్ కోవిడ్-19తో కూడా బాధపడుతున్నాడని స్పష్టం అయ్యింది. ఈ మేరకు హెన్నెపిన్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయం విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది. సాధారణంగా రోగులు, మృతుల వివరాలు బయటకు వెల్లడించడం అమెరికాలో నిషేధం. కానీ జార్జ్ […]

Update: 2020-06-04 08:39 GMT

వాషింగ్టన్: అమెరికాలో పోలీసుల దురుసు ప్రవర్తన కారణంగా ప్రాణాలు కోల్పోయిన జార్జ్ ఫ్లాయిడ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. పోలీసు మోకాలితో నొక్కడం వల్లే మరణించాడని పోస్టుమార్టం రిపోర్టులో వెలువడింది. అంతేగాకుండా అతడి రక్త నమూనాలను పరీక్షించగా అప్పటికే జార్జ్ కోవిడ్-19తో కూడా బాధపడుతున్నాడని స్పష్టం అయ్యింది. ఈ మేరకు హెన్నెపిన్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయం విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది. సాధారణంగా రోగులు, మృతుల వివరాలు బయటకు వెల్లడించడం అమెరికాలో నిషేధం. కానీ జార్జ్ కుటుంబీకుల అనుమతి మేరకు ఈ వివరాలు వెల్లడిస్తున్నట్టు మెడికల్ ఎగ్జామినర్ ఆండ్రూ బేకర్ స్పష్టం చేశారు. ఏప్రిల్ 3న జార్జ్‌కు కరోనా పరీక్ష నిర్వహించగా అతడికి పాజిటివ్ అని తేలింది. కానీ అతడిలో ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో ఐసోలేషన్ చేయలేదు. మరణించిన తర్వాత చేసిన అటాప్సీ రిపోర్టులో కూడా అతని ఊపిరితిత్తులు ఆరోగ్యంగానే ఉన్నాయని.. కానీ అతను కరోనాతో బాధపడుతున్నాడని మాత్రం ఆయన స్పష్టం చేశారు.

Tags:    

Similar News