తెలంగాణవాసులకు గుడ్ న్యూస్.. గాంధీలో జీనో‌మ్ టెస్టులు షురూ

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా కొత్త వేరియంట్‌లను గుర్తించేందుకు నిర్వహించే జీనోమ్ సీక్వెన్సీ ఇక నుంచి గాంధీ ఆస్పత్రిలో జరుగనున్నాయి. ఈ మేరకు సోమవారం నుంచి గాంధీలో జీనోమ్ ట్రయిల్ నిర్వహిస్తున్నారు. కరోనా వేరియంట్ల స్టడీ కోసం ఇప్పటివరకు వైద్య శాఖ శాంపిల్స్‌ను పూణే వైరాలజీ ల్యాబ్‌కు పంపించింది. రిపోర్ట్‌లు రావడానికి సుమారు 3 రోజుల సమయం పడుతున్నది. దీనితో అప్పటికే బాధితుల్లో వ్యాధి నిర్ధారణ ఆలస్యం అవుతోంది. ఈ క్రమంలో కొందరు అనుమానితులు జనాల్లో […]

Update: 2021-12-20 01:45 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా కొత్త వేరియంట్‌లను గుర్తించేందుకు నిర్వహించే జీనోమ్ సీక్వెన్సీ ఇక నుంచి గాంధీ ఆస్పత్రిలో జరుగనున్నాయి. ఈ మేరకు సోమవారం నుంచి గాంధీలో జీనోమ్ ట్రయిల్ నిర్వహిస్తున్నారు. కరోనా వేరియంట్ల స్టడీ కోసం ఇప్పటివరకు వైద్య శాఖ శాంపిల్స్‌ను పూణే వైరాలజీ ల్యాబ్‌కు పంపించింది. రిపోర్ట్‌లు రావడానికి సుమారు 3 రోజుల సమయం పడుతున్నది. దీనితో అప్పటికే బాధితుల్లో వ్యాధి నిర్ధారణ ఆలస్యం అవుతోంది.

ఈ క్రమంలో కొందరు అనుమానితులు జనాల్లో కలిసిపోతున్నారు. దీంతో వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. అందుకే గాంధీలో జీనోమ్ పరీక్షలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల కిట్లు, కావల్సిన రసాయన పదార్థాలను కూడా గాంధీలో సమకూర్చారు. టెస్టింగ్ ప్రక్రియలో సీసీఎమ్‌బీ సహకారం కూడా తీసుకోనున్నట్లు సమాచారం. దీంతో ఉదయం సేకరించిన శాంపిల్స్‌కు సాయంత్రం వరకు ఫలితాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు.

 

Tags:    

Similar News