నిమ్స్‌లో జెనిటిక్ ల్యాబ్, హై టెక్నాలజీ ఎక్విప్‌మెంట్‌ను ప్రారంభించిన మంత్రి హరీష్
దిశ, తెలంగాణ బ్యూరో : నిమ్స్ ఆసుపత్రిలో జన్యుపరంగా వచ్చే సమస్యలను గుర్తించే జెనిటిక్ ల్యాబ్ అందుబాటులోకి వచ్చింది. వారసత్వంగా వచ్చే అన్ని రకాల జన్యు లోపాలను సవరించే అత్యాధునిక ల్యాబ్ మంగళవారం షురూ అయింది. దీనితో పాటు మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్‌ని కూడా ఏర్పాటు చేశారు. అంతేగాక బోన్ డెన్సిటివ్ మీటర్‌నూ సమకూర్చారు. దీని ద్వారా బోన్స్ డెన్స్ ఎంత ఉంది అని టెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సర్కార్ ఆసుపత్రిలో ఈ విధానం తీసుకురావడం […]
దిశ, తెలంగాణ బ్యూరో : నిమ్స్ ఆసుపత్రిలో జన్యుపరంగా వచ్చే సమస్యలను గుర్తించే జెనిటిక్ ల్యాబ్ అందుబాటులోకి వచ్చింది. వారసత్వంగా వచ్చే అన్ని రకాల జన్యు లోపాలను సవరించే అత్యాధునిక ల్యాబ్ మంగళవారం షురూ అయింది. దీనితో పాటు మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్‌ని కూడా ఏర్పాటు చేశారు. అంతేగాక బోన్ డెన్సిటివ్ మీటర్‌నూ సమకూర్చారు. దీని ద్వారా బోన్స్ డెన్స్ ఎంత ఉంది అని టెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సర్కార్ ఆసుపత్రిలో ఈ విధానం తీసుకురావడం ఇదే తొలిసారి.
మరోవైపు రెండున్నర కోట్లతో న్యుమాటిక్ వ్యూ సిస్టమ్ వచ్చింది. ఆ మిషన్‌లో టెస్టింగ్ శాంపిల్స్‌ను పెడితే అది ల్యాబ్‌లోకి వెళ్లి, ఆటోమేటిక్‌గా తిరిగి ఆ ఫలితాలు తెస్తుంది. ఈ నూతన మిషనరీని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మంగళవారం ప్రారంభిచారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం సూచనతో 12 కోట్లతో వివిధ మెడికల్ ఎక్విప్మెంట్ అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. నిమ్స్‌లో గతంలో బెడ్ దొరకడం కష్టంగా ఉండేదని, కానీ.. కేసీఆర్ నిమ్స్‌ను బలోపేతం చేయాలని, మరో 200 పడకల ఐసీయూ బెడ్స్‌ను మంజూరు చేశారని చెప్పారు. ఈ 200 బెడ్స్ జనవరి 15వ తేదీలోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇవి పూర్తైతే పేద ప్రజలకు నిమ్స్‌లో 350 ఐసీయూ బెడ్స్ అందుబాటులోకి వస్తాయన్నారు. వెంటిలేటర్ గతంలో దొరకాలంటే కష్టంగా ఉండేదని, పేదవాళ్లు వెంటిలేటర్‌పై ఉండాలంటే లక్షల రూపాయలు ఖర్చు అయ్యేదని వెల్లడించారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న 89 వెంటిలేటర్లకు అదనంగా మరో 120 కొత్త వెంటిలేటర్లను తెస్తున్నామన్నారు. దీంతో మొత్తం 209 వెంటిలేటర్లు అందుబాటులోకి వస్తున్నట్టు పేర్కొన్నారు. వచ్చే 45 రోజుల్లో వెంటిలేటర్లు, ఐసీయూ బెడ్స్ అందుబాటులోకి తెస్తామన్నారు.
రాబోయే రోజుల్లో 153 కోట్లతో అన్ని విభాగాలకు మౌలిక వసతులు, మ్యాన్ పవర్ సిద్ధం చేస్తామన్నారు. ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు నిమ్స్‌తో పాటు మరో 4 ఆసుపత్రులు తీసుకువస్తున్నామని తెలిపారు. అల్వాల్‌లో, గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్‌లో, టిమ్స్‌లో, చెస్ట్ ఆసుపత్రిలో నాలుగు వైపులా వేయి పడకల ఆసుపత్రులు.. తెలంగాణ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కింద అందుబాటులోకి వస్తాయన్నారు. నిమ్స్‌లో గర్భిణీల కోసం కిడ్నీ, గుండె, హై బీపీతో చికిత్సకు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేస్తామన్నారు. అంతేకాకుండా ఇక నుంచి అందరు రోగులకు భోజనం పెట్టాలని నిమ్స్ డైరెక్టర్‌కు ఆదేశించారు. డాక్టర్ చెప్పిన డైట్ తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. మరోవైపు జీహెచ్ఎంసీ రూ. 5 భోజనాన్ని కూడా పెట్టించే ప్రయత్నం చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో టీకా పంపిణీ మరింత వేగవంతం అయ్యేందుకు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రచారం నిర్వహించాలని కోరారు.