నడి రోడ్డుపైనే జనరేటర్
దిశ, న్యూస్‌బ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో ఆక్రమణలను తొలగిస్తామని అధికారులు చెబుతున్నారు. అందుకు సంబంధించి ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకునేందుకు ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. అయితే నేరుగా ఈవీడీఎం డైరక్టర్కే ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆరోపణలు వస్తున్నాయి. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ రోడ్ నెంబర్ 70లో ప్రైవేటు వ్యక్తులు జనరేటర్ ఏర్పాటు చేశారు. రోడ్డును ఆక్రమించి ఉండటంతో స్థానికులకు ఇబ్బందులు వస్తున్నాయని నేరుగా ఈవీడీఎం డైరక్టర్‌కు పలువురు ఫిర్యాదు చేశారు. రోజులు గడుస్తున్నా సమస్యను పరిష్కరించలేదు. విభాగాధిపతికే […]
దిశ, న్యూస్‌బ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో ఆక్రమణలను తొలగిస్తామని అధికారులు చెబుతున్నారు. అందుకు సంబంధించి ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకునేందుకు ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. అయితే నేరుగా ఈవీడీఎం డైరక్టర్కే ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆరోపణలు వస్తున్నాయి. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ రోడ్ నెంబర్ 70లో ప్రైవేటు వ్యక్తులు జనరేటర్ ఏర్పాటు చేశారు. రోడ్డును ఆక్రమించి ఉండటంతో స్థానికులకు ఇబ్బందులు వస్తున్నాయని నేరుగా ఈవీడీఎం డైరక్టర్‌కు పలువురు ఫిర్యాదు చేశారు. రోజులు గడుస్తున్నా సమస్యను పరిష్కరించలేదు. విభాగాధిపతికే ఫిర్యాదు చేసి రోజులు గడుస్తున్నా సమస్యపై చర్యలు తీసుకోవడం లేదని, ఇక సాధారణ ప్రజల నుంచి కంప్లయింట్స్ మీద ఏం చేస్తారనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి ఆక్రమణలు తొలగించాలని వారు కోరుతున్నారు.