రీఎంట్రీకి సిద్ధమైన టాలీవుడ్ హీరోయిన్.. అలాంటి క్యారెక్టర్సే చేస్తదంట
దిశ, సినిమా : క్యూట్ అండ్ బబ్లీ లుక్‌తో టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణించిన జెనీలియా.. వివాహం తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. తెలుగులో ‘బొమ్మరిల్లు’ సినిమాలో చేసిన హాసిని క్యారెక్టర్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి, ఆ తర్వాత కోస్టార్ రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ఇద్దరు పిల్లల పెంపకంలో బిజీగా ఉండి తిరిగి సినిమాల్లో నటించలేదు. ఇప్పుడు పిల్లలు కాస్త పెద్దవాళ్లు కావడంతో మళ్లీ కమ్‌బ్యాక్ ఇచ్చే అవకాశాలు […]
దిశ, సినిమా : క్యూట్ అండ్ బబ్లీ లుక్‌తో టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణించిన జెనీలియా.. వివాహం తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. తెలుగులో ‘బొమ్మరిల్లు’ సినిమాలో చేసిన హాసిని క్యారెక్టర్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి, ఆ తర్వాత కోస్టార్ రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ఇద్దరు పిల్లల పెంపకంలో బిజీగా ఉండి తిరిగి సినిమాల్లో నటించలేదు. ఇప్పుడు పిల్లలు కాస్త పెద్దవాళ్లు కావడంతో మళ్లీ కమ్‌బ్యాక్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే యాక్ట్రెస్ అంటే నటన ఒక్కటే కాదు, గ్లామర్, ఫిజిక్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి.. తనకు సూటయ్యే క్యారెక్టర్స్ వస్తే తప్పకుండా చేస్తానంటోంది జెనీలియా. ‘తానెప్పుడూ బబ్లీ గర్ల్గానే ఉంటాను కానీ బబ్లీ మామ్ కూడా కావచ్చు. ఆ రకమైన ప్రేమ కథలు, సినిమాలను ఎంచుకుంటాను’ అని తన యాక్టింగ్ ఇంట్రెస్ట్‌ను బయటపెట్టింది.