గీతం పూర్వ విద్యార్థినికి DRDO ఫెలోషిప్
దిశ, పటాన్ చెరు : హైదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో 2016-2020 మధ్య ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పూర్తిచేసిన కె.స్వర్ణశ్రీ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ)లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అవార్డుకు ఎంపికైంది. ఈ విషయాన్ని ఏరోస్పేస్ ఇంజినీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ ఏ.సత్యాదేవి బుధవారం పేర్కొన్నారు. డీఆర్ డీఓ మానవ వనరుల విభాగాధిపతి ఎస్.జీవన్ బాబు మార్చి 1న స్వర్ణశ్రీకి ఓ లేఖను పంపారన్నారు. ఆమె ఫెలోషిప్ అంగీకరించాక కంచన్‌బాగ్ లోని డీఆర్‌డీఓ టౌన్‌షిప్‌లో వసతి […]
దిశ, పటాన్ చెరు : హైదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో 2016-2020 మధ్య ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పూర్తిచేసిన కె.స్వర్ణశ్రీ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ)లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అవార్డుకు ఎంపికైంది. ఈ విషయాన్ని ఏరోస్పేస్ ఇంజినీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ ఏ.సత్యాదేవి బుధవారం పేర్కొన్నారు. డీఆర్ డీఓ మానవ వనరుల విభాగాధిపతి ఎస్.జీవన్ బాబు మార్చి 1న స్వర్ణశ్రీకి ఓ లేఖను పంపారన్నారు.
ఆమె ఫెలోషిప్ అంగీకరించాక కంచన్‌బాగ్ లోని డీఆర్‌డీఓ టౌన్‌షిప్‌లో వసతి సౌకర్యం కల్పిస్తామని సత్యాదేవి వివరించారు. అంతేకాక ఏడాదికి రూ.15 వేల గ్రాంటును కూడా పొందే వీలుందన్నారు. గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య, పలువురు అధ్యాపకులు స్వర్ణశ్రీకి ఫెలోషిప్ రావడంపై హర్షం వ్యక్తం చేసినట్లు ఆమె చెప్పారు.