‘గాయత్రి గ్రానైట్స్’ రూ.25లక్షల విరాళం
దిశ, ఖమ్మం: కరోనా కట్టడికి ప్రముఖ గాయత్రి గ్రానైట్స్ యజమాని, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర రూ.25లక్షల విరాళం ప్రకటించారు. సంబంధిత చెక్కును హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌తో కలిసి ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌కు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా గాయత్రి రవిని మంత్రులిద్దరూ అభినందించారు. తన అభిమానులు, యువకులు.. గాయత్రి గ్రానైట్స్ సహకారంతో ఇప్పటికే ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో పేదలు, వలస కార్మికులకు నిత్యావసర సరుకులు, భోజన […]
దిశ, ఖమ్మం: కరోనా కట్టడికి ప్రముఖ గాయత్రి గ్రానైట్స్ యజమాని, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర రూ.25లక్షల విరాళం ప్రకటించారు. సంబంధిత చెక్కును హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌తో కలిసి ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌కు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా గాయత్రి రవిని మంత్రులిద్దరూ అభినందించారు. తన అభిమానులు, యువకులు.. గాయత్రి గ్రానైట్స్ సహకారంతో ఇప్పటికే ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో పేదలు, వలస కార్మికులకు నిత్యావసర సరుకులు, భోజన సదుపాయాలు, మాస్క్‌ల పంపిణీ వంటి పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు రవి తెలిపారు. లాక్ డౌన్ కొనసాగినన్ని రోజులు తమ సేవలు నిరంతరాయంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మంత్రులను కలిసిన వారిలో వద్దిరాజు నాగరాజు కూడా ఉన్నారు.
Tags: gayathri ravi, gayathri granites, cmrf, 25 lakh rupees donation, ktr, etala rajendhar, pragathi bhavan,