పని మనిషికి గౌతం గంభీర్ అంత్యక్రియలు

బీజేపీ ఎంపీ,ఇండియన్ మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ మానవత్వాన్ని మరోసారి చాటుకున్నాడు. తన ఇంట్లో పని చేసే పని మనిషి అంత్యక్రియలు స్వయంగా నిర్వహించాడు. ఒడిషాలోని జాజ్‌పూర్ జిల్లాకు చెందిన సరస్వతి ప్రతా గత ఆరేళ్లుగా గంభీర్ ఇంట్లో పని చేస్తోంది. తాజాగా ఆమెకు మధుమేహం, అధిక రక్తపోటుతో ఆసుపత్రిలో చేరింది. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే ప్రస్తుతం లాక్‌డౌన్ ఉన్న కారణంగా ఆమె మృతదేహాన్ని ఒడిశాలోని ఆమె కుంటుంబానికి పంపలేకపోయారు. ఈ క్రమంలో […]

Update: 2020-04-25 00:57 GMT

బీజేపీ ఎంపీ,ఇండియన్ మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ మానవత్వాన్ని మరోసారి చాటుకున్నాడు. తన ఇంట్లో పని చేసే పని మనిషి అంత్యక్రియలు స్వయంగా నిర్వహించాడు. ఒడిషాలోని జాజ్‌పూర్ జిల్లాకు చెందిన సరస్వతి ప్రతా గత ఆరేళ్లుగా గంభీర్ ఇంట్లో పని చేస్తోంది. తాజాగా ఆమెకు మధుమేహం, అధిక రక్తపోటుతో ఆసుపత్రిలో చేరింది. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే ప్రస్తుతం లాక్‌డౌన్ ఉన్న కారణంగా ఆమె మృతదేహాన్ని ఒడిశాలోని ఆమె కుంటుంబానికి పంపలేకపోయారు. ఈ క్రమంలో గంభీర్ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషయాన్ని గంభీర్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ఆమె మా ఇంట పని కాదు. నా పిల్లలను జాగ్రత్తగా చూసుకున్న ఆమె ఎప్పటికీ నా కుటుంబ సభ్యురాలే. ఆమె అంత్యక్రియలు నిర్వహించడం నా బాధ్యతగా భావించాను. కులం, మతం, ప్రాంతం, సామాజిక పరిస్థితులతో సంబంధం లేకుండా అందరినీ గౌరవించాలని నేను ఎప్పుడూ నమ్ముతాను. అదే దేశం ఆలోచన అంటూ గంభీర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలా మంది గంభీర్‌ను ప్రశంసిస్తున్నారు.

Tags: BJp Mp,Gautham Ghambhir,Domestic worker, last rites

Tags:    

Similar News