కరోనాను అరికట్టేందుకు నిధులు సిద్ధం!

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ మరో అడుగు ముందుకు వేసింది. బిల్ అండ్ మెలిండా ఫౌండేషన్ ఇతర స్వచ్ఛంద సంస్థలతో కలిసి మార్చి 10 తర్వాత 125 మిలియన్ డాలర్లతో కరోనా వైరస్ చికిత్స కోసం ఇవ్వనున్నట్టు ప్రతిజ్ఞ చేశాయి. ఈ నిధులతో కరోనాను నిలువరించేందుకూ, భవిష్యత్తులో కరోనా బారిన పడే వారికి చికిత్స అందించేందుకూ ఉపయోగించనున్నారు. వైరస్‌ను అడ్డుకునేందుకు […]

Update: 2020-03-10 07:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ మరో అడుగు ముందుకు వేసింది. బిల్ అండ్ మెలిండా ఫౌండేషన్ ఇతర స్వచ్ఛంద సంస్థలతో కలిసి మార్చి 10 తర్వాత 125 మిలియన్ డాలర్లతో కరోనా వైరస్ చికిత్స కోసం ఇవ్వనున్నట్టు ప్రతిజ్ఞ చేశాయి. ఈ నిధులతో కరోనాను నిలువరించేందుకూ, భవిష్యత్తులో కరోనా బారిన పడే వారికి చికిత్స అందించేందుకూ ఉపయోగించనున్నారు. వైరస్‌ను అడ్డుకునేందుకు ఔషధాల తయారీపై దృష్టి పెట్టనున్నారు.

వైరస్‌ను ఎదుర్కోలేని పేద దేశాల్లో చికిత్స కోసం కూడా ఈ నిధులను వాడనున్నట్టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపింది. ప్రస్తుతానికి కరోనా వ్యాధిని అరికట్టేందుకు ఎలాంటి మందులు అందుబాటులో లేవు. కరోనాకు సరైన చికిత్స అందించేందుకు, దానికి తగిన మందులు తయారీకి గేట్స్ ఫౌండేషన్‌తో పాటు వెల్‌కమ్ ట్రస్ట్ మెడికల్ ఛారిటీ సంయుక్తంగా 100 మిలియన్ డాలర్లను ప్రకటించాయి. వీటితో పాటు మాస్టర్ కార్డ్ ఇంపాక్ట్ ఫండ్ సంస్థ మరో 25 మిలియన్ల వరకూ ఇవ్వనున్నట్టు సమాచారం.

ఈ సందర్భంగా..’కరోనా అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. కానీ వైరస్‌ను అడ్డుకునేందుకు అవసరమైన టీకాలు గానీ, చికిత్సలు గానీ వేగంగా జరగట్లేడు’ అని బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సీఈవో మార్క్ సుజ్మాన్ చెప్పారు. ‘కరోనాను నుంచి ప్రపంచాన్ని సురక్షితంగా ఉంచడానికి పరిశోధనలు వేగంగా జరగాలి. దానికోసం మేమొక మార్గాన్ని కనిపెట్టాం. అన్ని దేశాల ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు, దాతృత్వ సంస్థలు కలిసి పనిచేయాలని, పరిశోధనల కోసం నిధులు సమకూర్చడానికి సిద్ధమవ్వాలని’ సుజ్మాన్ తెలిపారు.

Tags:    

Similar News