వేమవరంలో గ్యాస్ లీక్… గ్రామం ఖాళీ
దిశ, ఏపీ బ్యూరో: వైజాగ్ ఎల్జీ పాలిమర్స్‌లో స్టైరిన్ గ్యాస్ లీకేజీ ఘటన ఇంకా మరుగున పడకముందే గ్యాస్ లీకేజీలు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి విధించిన లాక్‌డౌన్ నేపథ్యంలో పరిశ్రమలన్నీ రెండు నెలల పాటు మూతపడ్డాయి. నాలుగోదశ లాక్‌డౌన్ సడలింపులతో పరిశ్రమలు తెరుచుకుంటున్నాయి. ఈ క్రమంలో రెండు నెలలపాటు మెయింటెనెన్స్ సరిగ్గా లేక గ్యాస్ లీకేజీలు సంభవించి ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట మండలం […]
దిశ, ఏపీ బ్యూరో: వైజాగ్ ఎల్జీ పాలిమర్స్‌లో స్టైరిన్ గ్యాస్ లీకేజీ ఘటన ఇంకా మరుగున పడకముందే గ్యాస్ లీకేజీలు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి విధించిన లాక్‌డౌన్ నేపథ్యంలో పరిశ్రమలన్నీ రెండు నెలల పాటు మూతపడ్డాయి. నాలుగోదశ లాక్‌డౌన్ సడలింపులతో పరిశ్రమలు తెరుచుకుంటున్నాయి. ఈ క్రమంలో రెండు నెలలపాటు మెయింటెనెన్స్ సరిగ్గా లేక గ్యాస్ లీకేజీలు సంభవించి ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట మండలం వేమవరంలోని ఓ బోర్‌కు సిబ్బంది మరమ్మతులు చేస్తుండగా గ్యాస్ లీకేజీ కావడంతో అలజడి రేగింది. గ్యాస్ లీకేజీతో పాటు భారీ శబ్దాలు కూడా వెలువడ్డాయి. దీంతో స్థానికులు హడలిపోయారు. వెంటనే ఆ పరిసరాలకు చేరుకున్న అధికారులు హుటాహుటీన గ్రామస్తులను ఖాళీ చేయించారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి మరమ్మతులు చేస్తున్నారు.