వెల్లుల్లితో క్యాన్సర్‌కు చెక్..!
క్యాన్సర్ వ్యాధి ప్రాణాంతక వ్యాధిగా తయారైంది. ఏటా క్యాన్సర్ వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరుగుతునే ఉంది. మన జీవన శైలితో పాటు మనం తీసుకునే ఆహారం ఈ వ్యాధికి ప్రధాన కారణం. మనం తీసుకునే ఆహారపదార్థాలు క్యాన్సర్ ను చాలా వరకు నిరోధించవచ్చు. క్యాన్సర్ వ్యాధి నుంచి కొంత ఉపశమనం పొందడానికి వెల్లుల్లి ఎంతగానో ఉపయోగపడుతాయి. వెల్లుల్లికి 14 రకాల క్యాన్సర్లతో పాటు ఇతర జబ్బులు రాకుండా చేసే శక్తి ఉందని ఓ తాజా పరిశోధనలో తేలింది. వెల్లుల్లి […]
క్యాన్సర్ వ్యాధి ప్రాణాంతక వ్యాధిగా తయారైంది. ఏటా క్యాన్సర్ వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరుగుతునే ఉంది. మన జీవన శైలితో పాటు మనం తీసుకునే ఆహారం ఈ వ్యాధికి ప్రధాన కారణం. మనం తీసుకునే ఆహారపదార్థాలు క్యాన్సర్ ను చాలా వరకు నిరోధించవచ్చు. క్యాన్సర్ వ్యాధి నుంచి కొంత ఉపశమనం పొందడానికి వెల్లుల్లి ఎంతగానో ఉపయోగపడుతాయి.
వెల్లుల్లికి 14 రకాల క్యాన్సర్లతో పాటు ఇతర జబ్బులు రాకుండా చేసే శక్తి ఉందని ఓ తాజా పరిశోధనలో తేలింది. వెల్లుల్లి క్యాన్సర్ తో పోరాడేందుకు బాగా పని చేస్తుంది. వెల్లులిని వొలిచి పది నిమిషాలు ఉంచితే క్యాన్సర్ ను నిరోధించే ఎంజైమ్ ఎలెనాస్ బాగా మెరుగవుతుంది. దీనిలో సల్ఫర్ పరిమాణము ఎక్కువ వున్నందున ఘాటైన వాసన వస్తుంది. క్యాన్సర్ పేషెంట్లు రోజుకు ఐదు లేదా ఆరు వెల్లుల్లిలను తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒక్కో రెమ్మను 15 నిమిషాల వ్యవధి ఇచ్చి తినాలి. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ కేన్సర్ తత్వాలు ఉండడంతో కొంత మేర క్యాన్సర్ వ్యాధిని తగ్గించవచ్చు.
వెల్లుల్లి రేకులను రోజుకు ఓ మూడు నోట్లో వేసుకుంటే చెడు కొలెస్ట్రాల్‌ను 10 శాతం వరకు తగ్గించుకోవచ్చు. దీంతో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతోంది. ఇక అధిక రక్తపోటుకి వెల్లుల్లి మంచి ఔషధం. ప్రతిరోజూ తీసుకునే ఆహారాల్లోనూ వెల్లుల్లిని విరివిగా వాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి క్యాన్సర్ ను నిరోధించడమే కాకుండా 166 రకాల జబ్బులు రాకుండా అడ్డుకుంటాయని పరిశోధకులు అంటున్నారు.