చెత్త బండి నడిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
దిశ ప్రతినిది, మహబూబ్ నగర్: రాష్ట్రంలో రైతు రాజ్యం తేవడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా పనిచేస్తున్నారని, దానికి రైతుల నుంచి కూడా సంపూర్ణ మద్దతు లభించడం హర్షించదగ్గ విషయమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం ఆయన నారాయణపేట జిల్లాలోని కోస్గిలో పర్యటించిన మంత్రి కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి తో కలిసి రైతు వేదిక భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా కోస్గి మున్సిపాలిటీ కేంద్రంలో మున్సిపాలిటీకి నూతనంగా ఏర్పాటు చేసిన చెత్త సేకరణ […]
దిశ ప్రతినిది, మహబూబ్ నగర్: రాష్ట్రంలో రైతు రాజ్యం తేవడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా పనిచేస్తున్నారని, దానికి రైతుల నుంచి కూడా సంపూర్ణ మద్దతు లభించడం హర్షించదగ్గ విషయమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం ఆయన నారాయణపేట జిల్లాలోని కోస్గిలో పర్యటించిన మంత్రి కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి తో కలిసి రైతు వేదిక భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా కోస్గి మున్సిపాలిటీ కేంద్రంలో మున్సిపాలిటీకి నూతనంగా ఏర్పాటు చేసిన చెత్త సేకరణ బ్యాటరీ ఆటోలను, డ్రైనేజీ కాలువల శుభ్రం చేయడానికి ఏర్పాటు చేసిన మినీ క్రెన్ ను మంత్రి ప్రారంభించిన ఆయన వాటిని కాసేపు నడిపారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు మంత్రి, ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ హరిచందన, ఎస్పీ చేతన మాస్క్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్నా సమయంలో పారిశుధ్య కార్మికులు చేస్తున్న సేవలను ప్రతీ ఒక్కరూ గుర్తించాలన్నారు. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అలాగే ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా రైతులు ఇబ్బందులు పడకుండా ఉండాలని ఆలోచించి సీఎం కేసీఆర్ రైతు బంధును విడుదల చేస్తున్నారన్నారు.