జడేజా ఆడేందుకు వీల్లేదు ! : గంగూలీ

భారత క్రికెట్ జట్టులో ఆల్‌రౌండర్‌గా మూడు ఫార్మాట్లలోనూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ఆటగాడు రవీంద్ర జడేజా. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌‌లోనూ రాణిస్తూ జట్టులో కీలక సభ్యుడిగా మారాడు. అయితే ఈ నెల 9 నుంచి సౌరాష్ట్ర, బెంగాల్ జట్ల మధ్య జరగనున్న రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో రవీంద్ర జడేజాను ఆడించాలని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ భావించింది. ఈ మేరకు బీసీసీఐకి తమ అభ్యర్థనను తెలిపింది. కాగా, సౌరాష్ట్ర అభ్యర్థనను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ […]

Update: 2020-03-06 05:57 GMT

భారత క్రికెట్ జట్టులో ఆల్‌రౌండర్‌గా మూడు ఫార్మాట్లలోనూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ఆటగాడు రవీంద్ర జడేజా. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌‌లోనూ రాణిస్తూ జట్టులో కీలక సభ్యుడిగా మారాడు. అయితే ఈ నెల 9 నుంచి సౌరాష్ట్ర, బెంగాల్ జట్ల మధ్య జరగనున్న రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో రవీంద్ర జడేజాను ఆడించాలని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ భావించింది. ఈ మేరకు బీసీసీఐకి తమ అభ్యర్థనను తెలిపింది.

కాగా, సౌరాష్ట్ర అభ్యర్థనను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తిరస్కరించాడు. ఈ నెల 12 నుంచి దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. టీమ్ ఇండియాలో కీలక సభ్యుడైన జడేజాను రంజీకి పంపితే వన్డేలు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే జడేజా రంజీ ఫైనల్ ఆడటానికి గంగూలీ అంగీకరించలేదు. మరోవైపు చతేశ్వర్ పుజారా, వృద్ధిమాన్ సాహాలు రంజీ ఫైనల్ ఆడేందుకు మాత్రం బోర్డు అంగీకరించింది. వీరిద్దరూ దక్షిణాఫ్రికాతో వన్డేలు ఆడే అవకాశం లేనందునే వీరికి పర్మిషన్ ఇచ్చినట్లు సమాచారం.

tags : Ravindra jadeja, Sourav ganguly, Ranji trophy, South Africa

Tags:    

Similar News