లొంగిపోయే దిశగా వికాస్ దుబే
దిశ, వెబ్ డెస్క్: యూపీ పోలీసులు ప్రముఖ గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే తలపై భారీ రివార్డును ప్రకటించారు. దుబేను పట్టిస్తే.. రూ.2.5 లక్షల రివార్డు ఇస్తామని తెలిపారు. ఈ విషయాన్ని యూపీ డీజీపీ ఆఫీస్ ఓ ప్రకటనలో తెలిపింది. అంతేగాకుండా తనను పట్టుకొనేందుకు కాన్పూర్ పోలీసులు తీవ్రంగా గాలిస్తుండటంతో ఢిల్లీ కోర్టులో లొంగిపోయేందుకు ప్రముఖ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు సమాచారం. ఢిల్లీకి సమీపంలోని ఓ పల్లెటూరులో ఉన్న వికాస్ దూబే.. కోర్టులో […]
దిశ, వెబ్ డెస్క్: యూపీ పోలీసులు ప్రముఖ గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే తలపై భారీ రివార్డును ప్రకటించారు. దుబేను పట్టిస్తే.. రూ.2.5 లక్షల రివార్డు ఇస్తామని తెలిపారు. ఈ విషయాన్ని యూపీ డీజీపీ ఆఫీస్ ఓ ప్రకటనలో తెలిపింది. అంతేగాకుండా తనను పట్టుకొనేందుకు కాన్పూర్ పోలీసులు తీవ్రంగా గాలిస్తుండటంతో ఢిల్లీ కోర్టులో లొంగిపోయేందుకు ప్రముఖ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు సమాచారం. ఢిల్లీకి సమీపంలోని ఓ పల్లెటూరులో ఉన్న వికాస్ దూబే.. కోర్టులో లొంగిపోయేందుకు సీనియర్ లాయర్‌తో మంతనాలు జరుపుతున్నట్టు తెలిసింది. కాన్పూర్‌లో 8 మంది పోలీసులను హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వికాస్ దుబే తీవ్ర ఇక్కట్లలో ఉన్నాడు. అతడి అత్యంత సన్నిహితులలో ఇద్దరు పట్టుబడగా.. బుధవారం ఉదయం, హమీర్‌పూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో సన్నిహితుడు అమర్ దుబే మృతి చెందాడు. దీని తరువాత, వికాస్ దూబే చాలా బలహీనంగా మారాడు. ఏ సమయంలోనైనా ఢిల్లీలో లొంగిపోగలడని పోలీసులు భావించి కోర్టుల వద్ద పహారా కాస్తున్నారు.
అంతకుముందు మంగళవారం ఉత్తర ప్రదేశ్ ఫరీదాబాద్‌లోని ఒక హోటల్‌లో ఉంటున్నట్టు సమాచారం అందింది. అయితే, పోలీసులు అక్కడికి వెళ్లే సరికి అక్కడ నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఇప్పుడు పోలీసులు ఢిల్లీలో అప్రమత్తమయ్యారు. ఫరీదాబాద్‌లో వికాస్ దూబేకు ఆశ్రయం ఇచ్చినందుకు ప్రభాత్, అంకూర్‌లను అరెస్టు చేశారు. నిందితులు ఇద్దరూ వికాస్ దూబే గ్రామస్తులు కావడం విశేషం.
మరోవైపు వికాస్ దూబే గ్రేటర్ నోయిడా కోర్టులో లొంగిపోవచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సూరజ్‌పూర్ కోర్టులో పోలీసులు భారీగా మోహరించారు. కోర్టు కాంప్లెక్స్ కూడా సీలు చేశారు. కాగా, వికాస్ దుబే భాగస్వామి అయిన ప్రభాత్ నుంచి పోలీసులు మూడు పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటిలో యూపీ పోలీసుల నుంచి లాక్కెళ్లిన రెండు పిస్టల్స్ ఉన్నాయి. ప్రభాత్, అంకూర్ తోపాటు అంకూర్ తండ్రి శ్రావణ్ ను కూడా అరెస్టు చేసినట్లు ఫరీదాబాద్ పోలీసులు ధృవీకరించారు. ఖేరి పుల్ పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. ముగ్గురినీ కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు సన్నద్ధులవుతున్నారు.