కిడ్నాప్‌తో రూ.1100 కోట్లు సొంతం.. ఆ డబ్బుల్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో బాధితుణ్నే అడిగిన గ్యాంగ్‌స్టర్

దిశ,వెబ్‌డెస్క్: ఉదాహరణకు ఓ గ్యాంగ్ స్టర్ డబ్బుల కోసం బిలినియర్ ముఖేష్ అంబానీ కొడుకును కిడ్నాప్ చేస్తే.. ఆయన ధనవంతుడు కాబట్టి కొడుకు కోసం ఎన్నివేల కోట్లైనా ఇస్తాడు. అలాగే ఇచ్చాడనుకుందాం. అలా ఇచ్చిన డబ్బుల్ని ఆ తెలివైన గ్యాంగ్ స్టర్ ఏం చేయాలి? తనకున్న తెలివి తేటలతో రజనీ కాంత్ సినిమాలోలా ముప్పై రోజుల్లో రూ.30 కోట్లతో రూ.3000 కోట్లు సంపాదించాలి. కానీ ఇతగాడు అలా చేయలేదు. బిలినియర్ కొడుకును కిడ్నాప్ చేసి వందల కోట్లను సొంతం […]

Update: 2021-03-25 22:28 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఉదాహరణకు ఓ గ్యాంగ్ స్టర్ డబ్బుల కోసం బిలినియర్ ముఖేష్ అంబానీ కొడుకును కిడ్నాప్ చేస్తే.. ఆయన ధనవంతుడు కాబట్టి కొడుకు కోసం ఎన్నివేల కోట్లైనా ఇస్తాడు. అలాగే ఇచ్చాడనుకుందాం. అలా ఇచ్చిన డబ్బుల్ని ఆ తెలివైన గ్యాంగ్ స్టర్ ఏం చేయాలి? తనకున్న తెలివి తేటలతో రజనీ కాంత్ సినిమాలోలా ముప్పై రోజుల్లో రూ.30 కోట్లతో రూ.3000 కోట్లు సంపాదించాలి. కానీ ఇతగాడు అలా చేయలేదు. బిలినియర్ కొడుకును కిడ్నాప్ చేసి వందల కోట్లను సొంతం చేసుకున్నాడు. అయితే ఆ డబ్బుల్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో బాధితుణ్ని అడిగాడు. అందుకు ఆ బిలినియర్ ఏం చేశాడో తెలుసా?

కాసినో ఈ ఆట గురించి మనందరికి తెలిసిందే. ఈ గేమ్ లో ఓడడమే తప్ప గెలిచిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. గెలిస్తే బాగానే ఉంటుంది. కానీ ఓడిపోతేనే జీవితం తల్లికిందులవుతుంది. ఉన్న ఆస్తుల్ని అమ్ముకొని రోడ్డున పడాల్సి వస్తుంది.అలా ఓ వ్యక్తి కాసినో ఆడి.., ఆటలో ఆస్తుల్ని పోగొట్టుకున్నాడు. చివరికి తాను చేసిన తింగరి పని వల్ల ఉరితీయబడ్డాడు.

చైనీస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ షో కథనం ప్రకారం.. చైనాకు చెందిన ‘చేంగ్’ జూదగాడు. చైనా మకావు’ అనే ప్రాంతంలో జరిగే కాసినో గేమ్ ఆడి ఆస్తుల్ని పోగొట్టుకుని రోడ్డున పడ్డాడు. కుటుంబ పోషణ కోసం గ్యాంగ్ స్టర్ గా మారాడు. డబ్బుల కోసం ఓ గ్యాంగ్ ను తయారు చేసుకొని.., చైనా దాని సరిహద్దు దేశాలకు చెందిన బిలియర్ల కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేసి భారీ ఎత్తున డబ్బుల్ని గొల్లగొట్టేవాడు.

అలా ఏసియా దేశాల్లోనే టాప్ బిలినియర్, హాంకాంగ్ కు చెందిన వ్యాపార వేత్త లికా షింగ్ కుమారుడు విక్టర్‌లీని కిడ్నాప్ చేశాడు. అనంతరం విక్టర్ లీని విడుదల చేయాలంటే తమకు రూ.1100 కోట్లు కావాలంటూ ఫోన్ లో బిలినియర్ లికాషింగ్ను బెదిరించాడు. దీంతో కొడుకు కోసం విక్టర్లీ అడిగినంత డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. చేంగ్ తన ప్లాన్ ప్రకారం డబ్బుతో ఓ ప్రాంతానికి రావాలంటూ లికాషింగ్ కు హుకుం జారీ చేశాడు. అయితే డబ్బులు తెచ్చే ముందు.. నువ్విచ్చే డబ్బుల్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో చెప్పాలంటూ ఫోన్ లో కోరాడు. చివరికి బిలియర్ కొడుకును అడ్డం పెట్టుకొని రూ.1100 కోట్లు దక్కించుకున్నాడు. ఈ కిడ్నాప్ ప్లాన్ ఏదో బాగుందని మరో బిలినియర్ తో పాటూ అక్రమాయుధాల రవాణా చేసి పోలీసుల మోస్ట్ వాంటెండ్ జాబితాలో చేంగ్ చేరిపోయాడు.

పలుమార్లు జైలు శిక్ష విధించినా బెయిల్ పై బయటకొచ్చి మళ్లీ తన నేర చరిత్రను కొనసాగించాడు. అయితే తన కుటుంబ సభ్యుల కిడ్నాప్ తో పాటూ భారీ మొత్తంలో డబ్బుల్ని దోచుకున్నాడని, ఆ డబ్బుల్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో నన్నే అడుగుతాడా? అంటూ బిలినియర్ లికా షింగ్.., చేంగ్ చేతిలో మోసపోయిన మరికొంతమంది బిలినియర్లతో చేతులు కలిపాడు. చేంగ్ ను పోలీసులకు పట్టించాడు. దీంతో పోలీసులు చేంగ్ ను నడిరోడ్డు మీద కాల్చి చంపించారు.

Tags:    

Similar News