దిశ వార్తపై స్పందించిన గండ్ర వెంకటరమణారెడ్డి
దిశ, భూపాలపల్లి: బూట్లు వేసుకుని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం తప్పేమీ కాదని, రాజ్యాంగంలో కూడా ఎక్కడా లేదని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సమర్థించుకున్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బూట్లు వేసుకుని జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. ఇదే అంశంపై దిశ వెబ్‌సైట్, డైనమిక్ ఎడిషన్‌లో వార్త ప్రచురితమైంది. ఇది సోషల్ మీడియా ద్వారా వైరల్ కావడంతో ఎమ్మెల్యే గండ్ర స్పందిస్తూ దిశ పత్రికను […]
దిశ, భూపాలపల్లి: బూట్లు వేసుకుని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం తప్పేమీ కాదని, రాజ్యాంగంలో కూడా ఎక్కడా లేదని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సమర్థించుకున్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బూట్లు వేసుకుని జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. ఇదే అంశంపై దిశ వెబ్‌సైట్, డైనమిక్ ఎడిషన్‌లో వార్త ప్రచురితమైంది. ఇది సోషల్ మీడియా ద్వారా వైరల్ కావడంతో ఎమ్మెల్యే గండ్ర స్పందిస్తూ దిశ పత్రికను ఉద్దేశించి స్పందించారు. దిశ వార్తకు నా స్పందన అంటూ ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. జాతీయ జెండా ఆవిష్కరించేటప్పుడు బూట్లు విప్పాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ప్రధాని మోడీ, భారత రాష్ట్రపతి సైనికాధికారులు, మొదటి ప్రధాని నెహ్రు సైతం బూట్లు వేసుకొనే జెండా ఆవిష్కరించేవారు. తప్పుడు వార్తలు రాసి మమ్మల్ని అప్రతిష్టపాలు పర్చడం మంచి పద్దతి కాదంటూ పేర్కొన్నారు. అయితే ఎమ్మెల్యే ప్రకటనపైనా భిన్నాభిప్రాయలను జనం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ప్రతీది రాజ్యాంగంలో రాయరని, నైతిక విలువలంటూ ఉండాలి కదా అంటూ గుర్తు చేస్తున్నారు.