రైతుల పంట కొనుగోలు చేసేదాక పోరాటం ఆగదు : గండ్ర సత్య నారాయణ రావు

దిశ,శాయంపేట : ప్రజా చైతన్య యాత్రలో భాగంగా శాయంపేట మండలంలో రైతులు పండించే పంట కొనుగోలు చేయాలని తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపి, తహసీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి గండ్ర సత్య నారాయణ రావు. ఈ సందర్భంగా సత్తన్న మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయకుండా రాజకీయ నాటకాలు ఆడుతున్నాయని, గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, రైతు పక్షపాతి […]

Update: 2021-11-24 03:55 GMT

దిశ,శాయంపేట : ప్రజా చైతన్య యాత్రలో భాగంగా శాయంపేట మండలంలో రైతులు పండించే పంట కొనుగోలు చేయాలని తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపి, తహసీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి గండ్ర సత్య నారాయణ రావు. ఈ సందర్భంగా సత్తన్న మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయకుండా రాజకీయ నాటకాలు ఆడుతున్నాయని, గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, రైతు పక్షపాతి ప్రభుత్వం అని చెప్పుకునే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు.

రైతు పండించిన పంటను వెంటనే కొనుగోలు చేయాలని, కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, వర్షాలవల్ల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రైతు పండించిన పంటను కొనుగోలు చేసే వరకు పోరాటాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, మండల పార్టీ అధ్యక్షులు,యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు అభిమానులు తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News