గణపతిపైనే బీజేపీ గెలుపు భారం..!!

దిశ, తెలంగాణ బ్యూరో : నిన్నటిదాకా ఎన్నికల ప్రచారం ముగిసిపోవడంతో బీజేపీ నాయకులంతా ఇప్పుడు దేవుడిపైనే భారం వేశారు. పైకి మేయర్ సీటు తమదే అని గంభీరంగా ప్రకటిస్తున్నా ఏ మేరకు గెలుపు ఉంటుందని అంచనాలు వేసుకుంటున్నారు. ఒకవైపు పోల్ మేనేజ్‌మెంట్ చేసుకుంటూనే మరోవైపు విజయాన్ని కాంక్షిస్తూ.. విఘ్నాలన్నీ తొలగిపోవాలంటూ పార్టీ కార్యాలయంలోనే సోమవారం గణపతి హోమాన్ని నిర్వహించారు ఆ పార్టీ నేతలు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన ఈ హోమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు […]

Update: 2020-11-30 04:07 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : నిన్నటిదాకా ఎన్నికల ప్రచారం ముగిసిపోవడంతో బీజేపీ నాయకులంతా ఇప్పుడు దేవుడిపైనే భారం వేశారు. పైకి మేయర్ సీటు తమదే అని గంభీరంగా ప్రకటిస్తున్నా ఏ మేరకు గెలుపు ఉంటుందని అంచనాలు వేసుకుంటున్నారు. ఒకవైపు పోల్ మేనేజ్‌మెంట్ చేసుకుంటూనే మరోవైపు విజయాన్ని కాంక్షిస్తూ.. విఘ్నాలన్నీ తొలగిపోవాలంటూ పార్టీ కార్యాలయంలోనే సోమవారం గణపతి హోమాన్ని నిర్వహించారు ఆ పార్టీ నేతలు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన ఈ హోమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ సంస్థాగత కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ తదితరులంతా ఈ హోమంలో పాల్గొన్నారు.

అమ్మవారికి మహిమలు ఉన్నాయి : బండి సంజయ్

చార్మినార్ సమీపంలోని భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలతో ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన బీజేపీ నేతలు ఇప్పుడు గణపతి హోమంతో విజయావకాశాలను అంచనా వేసుకుంటున్నారు. ప్రతీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదో ఒక హోమాన్ని, యాగాన్ని, యజ్ఞాన్ని నిర్వహించడం ఆనవాయితీ. చండీ మహా యాగం, సుదర్శన యాగం లాంటివెన్నో చేసి హిందువులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు అది బీజేపీ వంతయింది. దుబ్బాక గెలుపుతో జీహెచ్ఎంసీ ఎన్నికలపై కన్ను వేసిన ఆ పార్టీ నేతలు ప్రచారంలో హిందు-ముస్లిం అంశాన్ని దూకుడుగానే ప్రస్తావించారు.

ఇప్పుడు దానికి తగినట్లుగా ఆధ్యాత్మికంగా అడుగు వేస్తున్నారు. పోలింగ్‌కు ఒక రోజు ముందు పార్టీల నేతలంతా ఆఫీసులోనే హోమం చేసి విఘ్నాలన్నీ తొలగిపోవాలంటూ గణపతి హోమాన్ని నిర్వహించడం విశేషం. అగ్రనేతల ప్రచారం, మతపరమైన అంశాలు ఏ మేరకు కలిసి వచ్చినా రాకున్నా గణపతి హోమంపై చాలా ఆశలే పెట్టుకున్నారు.

Tags:    

Similar News