కేసీఆర్ ఇలాకాలో బిల్ కలెక్టర్‌పై కమిషనర్ దాడి..!
దిశ ప్రతినిధి, మెదక్: సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో అధికారులు కింది స్థాయి సిబ్బందిని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా బుధవారం బిల్ కలెక్టర్‌పై గజ్వేల్ మున్సిపల్ కమిషనర్ చేయిచేసుకోగా.. న్యాయం చేయాలని కోరుతూ బిల్ కలెక్టర్ మున్సిపల్ చైర్మన్‌కు మొర పెట్టుకున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నది. సదరు బిల్ కలెక్టర్ ఆవేదనను కొందరు వీడియో తీస్తుండగా వద్దని వారించడం గమనార్హం. ఇదంతా అబద్ధపు ప్రచారమని గజ్వేల్ […]
దిశ ప్రతినిధి, మెదక్: సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో అధికారులు కింది స్థాయి సిబ్బందిని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా బుధవారం బిల్ కలెక్టర్‌పై గజ్వేల్ మున్సిపల్ కమిషనర్ చేయిచేసుకోగా.. న్యాయం చేయాలని కోరుతూ బిల్ కలెక్టర్ మున్సిపల్ చైర్మన్‌కు మొర పెట్టుకున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నది. సదరు బిల్ కలెక్టర్ ఆవేదనను కొందరు వీడియో తీస్తుండగా వద్దని వారించడం గమనార్హం. ఇదంతా అబద్ధపు ప్రచారమని గజ్వేల్ మున్సిపల్ కమిషనర్ కొట్టి పారేశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే..
స్వామి అనే కాంట్రాక్ట్ ఉద్యోగి ‘బిల్ కలెక్టర్’గా తన ఉద్యోగాన్ని రెగ్యులరైజ్ చేయాలని గజ్వేల్ మున్సిపల్ చైర్మన్‌ను ఇటీవల కోరినట్టు చెప్పాడు. ఇదే విషయాన్ని కమిషనర్ వెంకటగోపాల్‌కు చైర్మన్ ప్రపోజల్ పెట్టారన్నాడు. దీంతో మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్ తన చాంబర్‌కు పిలిచి.. పిచ్చెక్కిందా అంటూ బూతులు తిట్టాడని స్వామి ఆవేదన వ్యక్తం చేశాడు. మూడు సార్లు తనపై చేయిచేసుకున్నాడని ఆరోపించాడు. తనను కొట్టే అధికారం మున్సిపల్ కమిషనర్‌కు ఎక్కడిది అని నిలదీశాడు. భారత రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా..? బిల్ కలెక్టర్‌ను కొట్టవచ్చా.. ఉంటే చూపించూ.. నేనేమైనా తప్పుచేస్తే మెమో ఇవ్వాలి కానీ, ఇలా కొట్టడం సరికాదు.. కేసీఆర్ రాజ్యాంగంలో ఏమైనా కొట్టాలని ఉందా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సరిగ్గా ఇదే సమయంలో జరిగిన తతంగాన్ని పలువురు వీడియో తీస్తుండగా అక్కడున్న అధికారులు వద్దంటూ వారించారు.
అదంతా ఫేక్..
ఇదే విషయంపై “దిశ” గజ్వేల్ మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్‌ను సంప్రదించగా.. బిల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న స్వామి మానసిక పరిస్థితి బాగుండదు. ఓ మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించిన విషయం అడగ్గా, దాన్ని దాటవేస్తూ తాను కొట్టినట్టు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నాడని చెప్పారు. -వెంకటగోపాల్, గజ్వేల్ మున్సిపల్ కమిషనర్