టీడీపీకి సీనియర్ నేత గుడ్ బై  

దిశ, వెబ్ డెస్క్: విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు టీడీపీకి గుడ్‌బై చెబుతున్నట్టు ఆదివారం ఒక ప్రకటన చేశారు. అయితే ఆయన ఏ పార్టీలో చేరనున్నారు అనే విషయంపై స్పందించలేదు. గద్దె బాబూరావు మీడియాతో మాట్లాడుతూ… ‘పార్టీలో పరిస్థితులు బాగోలేవు. సుదీర్ఘ కాలంగా టీడీపీలో పనిచేసినా గుర్తింపు లేదు. ఆత్మ గౌరవం, ఆత్మ స్థైర్యంతో పుట్టిన పార్టీ ప్రస్తుతం కనుమరుగైంది”. అందుకే రాజీనామా చేస్తున్నాను అన్నారు. ఎన్టీఆర్‌ ఉన్నప్పుడు […]

Update: 2020-09-27 00:41 GMT

దిశ, వెబ్ డెస్క్: విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు టీడీపీకి గుడ్‌బై చెబుతున్నట్టు ఆదివారం ఒక ప్రకటన చేశారు. అయితే ఆయన ఏ పార్టీలో చేరనున్నారు అనే విషయంపై స్పందించలేదు.

గద్దె బాబూరావు మీడియాతో మాట్లాడుతూ… ‘పార్టీలో పరిస్థితులు బాగోలేవు. సుదీర్ఘ కాలంగా టీడీపీలో పనిచేసినా గుర్తింపు లేదు. ఆత్మ గౌరవం, ఆత్మ స్థైర్యంతో పుట్టిన పార్టీ ప్రస్తుతం కనుమరుగైంది”. అందుకే రాజీనామా చేస్తున్నాను అన్నారు. ఎన్టీఆర్‌ ఉన్నప్పుడు పార్టీ వేరు, ఇప్పుటి టీడీపీ వేరు. చంద్రబాబు నాయుడు మాలాంటి వారికి గౌరవం ఇవ్వడం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా గద్దె బాబూరావు ఒకసారి ఎమ్మెల్సీ, రెండుసార్లు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌గా పని చేశారు.

అయితే ఆయన ఏ పార్టీలో చేరతారు అనే అంశంపై స్పష్టత రాలేదు. అధికార పార్టీలో చేరతారా లేదా కాషాయ కండువా కప్పుకుంటారా అనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. రాజధాని అస్త్రంతో ఉత్తరాదిలో బలం పుంజుకుంటున్న వైసీపీలో చేరతారు అని కొందరు భావిస్తున్నారు. మరి కొందరేమో దక్షిణాది నేతలకు జాతీయ పదవులు కట్టబెట్టి… దక్షిణాదిన దూకుడు పెంచుకుంటూ పోతున్న బీజేపీలో చేరతారేమో అని భావిస్తున్నారు. ఏమవుతుందో వేచి చూడాలి మరి.

Tags:    

Similar News