దేశంలో అశ్లీలత పెరిగిపోయింది : ప్రజాగాయకుడు గద్దర్

దిశ, జవహర్ నగర్: దేశాన్ని గత 70 సంవత్సరాలుగా వివిధ రకాల పార్టీలు పాలిస్తున్నా ప్రజల స్థితిగతులు, పరిస్థితులు మాత్రం మారడం లేదని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. ఈ మేరకు గురువారం కార్పొరేషన్ కేంద్రంలో ప్రజానాట్య మండలి రెండవ మహాసభలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గద్దర్‌ హాజరయ్యారు. అనంతరం కార్పొరేషన్ కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో కళా మండలి నాయకుడు వేంకటాచారి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో వారు పాల్గొని మాట్లాడారు. పేదల హక్కులను కాపాడడానికి 70 […]

Update: 2021-10-06 09:49 GMT

దిశ, జవహర్ నగర్: దేశాన్ని గత 70 సంవత్సరాలుగా వివిధ రకాల పార్టీలు పాలిస్తున్నా ప్రజల స్థితిగతులు, పరిస్థితులు మాత్రం మారడం లేదని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. ఈ మేరకు గురువారం కార్పొరేషన్ కేంద్రంలో ప్రజానాట్య మండలి రెండవ మహాసభలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గద్దర్‌ హాజరయ్యారు. అనంతరం కార్పొరేషన్ కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో కళా మండలి నాయకుడు వేంకటాచారి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో వారు పాల్గొని మాట్లాడారు. పేదల హక్కులను కాపాడడానికి 70 సంవత్సరాలుగా ప్రజానాట్య మండలి ప్రజల పక్షాన పోరాటాలు చేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రంగా చేస్తున్నామని గొప్పలు చెబుతున్నారే తప్ప ఆచరణలో మాత్రం శూన్యమని అన్నారు. ఆనాడు దొరల పాలన విముక్తి కోసం నాట్య మండలి పని చేసినదని, నేడు ఈ ప్రభుత్వాల ఆడగాలను ఆపడానికి మళ్లీ ముందుకు వస్తుందని అన్నారు. తెలంగాణను ఏలుతున్న ప్రభుత్వం నాలుగేళ్లుగా చేసింది ఏమీ లేదన్నారు. దేశంలో అశ్లీలత పెరిగి పోయిందన్నారు. ప్రభుత్వాల మోసాలను అరికట్టడానికి ప్రజానాట్య మండలి ముందుంటుందన్నారు.

గద్దర్‌ ఆటాపాట..
ప్రజానాట్య మండలి బహిరంగ సభలో గద్దర్‌ పాడిన పాటలు అందరినీ అలరించాయి. గద్దర్‌ గజ్జె కట్టి ఆడుతుంటే సభలో ఉన్న వారు అందరూ కోరస్‌ కలిపారు. కార్యక్రమంలో ప్రజానాట్య మండలి నాయకులు, రాష్ట్ర సీపీఐ కార్యవర్గ సభ్యుడు బాల మల్లేష్, సినీ దర్శకుడు బాబ్జీ, జిల్లా కార్యదర్శి సాయిలు గౌడ్, జిల్లా సీపీఐ కార్యవర్గ సభ్యుడు టీ శంకర్, కాప్రా మండల కార్యదర్శి నిమ్మల నర్సింహ, జవహర్ నగర్ కార్యదర్శి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News