కార్న్‌ స్టార్చ్‌తో ఫర్నిచర్..

దిశ, వెబ్‌డెస్క్: ఫర్నిచర్ తయారుచేయాలంటే.. కలప కావాలి లేదంటే ప్లాస్టిక్‌ను ఉపయోగించాలి. అయితే, ఈ రెండింటితోనూ కాలుష్యం ఏర్పడి పర్యావరణం దెబ్బతింటుంది. ఈ సమస్యకు పరిష్కారంగా.. కార్న్‌ స్టార్చ్ నుంచి మోడర్న్, స్టైలిష్, ఎన్విరాన్‌మెంటల్ ఫ్రెండ్లీ ఫర్నిచర్ తయారు చేస్తున్నాడు సౌత్ కొరియాకు చెందిన ఆర్టిస్ట్ యు జాన్జి డే( Ryu Jong-dae). ప్లాస్టిక్ వేస్ట్‌ను తగ్గించి, పర్యావరణ హితమైన ఫర్నిచర్ తయారు చేయాలనే ఉద్దేశంతో 40 ఏళ్ల యు జాన్జి.. కార్న్‌ ‌స్టార్చ్ ఆధారంగా ఏర్పడిన […]

Update: 2020-10-07 03:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఫర్నిచర్ తయారుచేయాలంటే.. కలప కావాలి లేదంటే ప్లాస్టిక్‌ను ఉపయోగించాలి. అయితే, ఈ రెండింటితోనూ కాలుష్యం ఏర్పడి పర్యావరణం దెబ్బతింటుంది. ఈ సమస్యకు పరిష్కారంగా.. కార్న్‌ స్టార్చ్ నుంచి మోడర్న్, స్టైలిష్, ఎన్విరాన్‌మెంటల్ ఫ్రెండ్లీ ఫర్నిచర్ తయారు చేస్తున్నాడు సౌత్ కొరియాకు చెందిన ఆర్టిస్ట్ యు జాన్జి డే( Ryu Jong-dae).

ప్లాస్టిక్ వేస్ట్‌ను తగ్గించి, పర్యావరణ హితమైన ఫర్నిచర్ తయారు చేయాలనే ఉద్దేశంతో 40 ఏళ్ల యు జాన్జి.. కార్న్‌ ‌స్టార్చ్ ఆధారంగా ఏర్పడిన బయోప్లాస్టిక్‌తో ఫర్నిచర్ తయారు చేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నాడు. ఈ ప్రాజెక్టుకు ‘డిజిటల్ క్రాఫ్ట్’ అని పేరు పెట్టుకున్నాడు. కార్న్ స్టార్చ్ లేదా షుగర్ కేన్ నుంచి ఉత్పత్తయ్యే పాలి లాక్టిక్ (పీఎల్ఏ)‌ను ఉపయోగించి వీటిని రూపొందిస్తున్నాడు. పర్టిక్యులర్ ఎన్విరాన్‌మెంటల్ కండిషన్లలో ఈ బయోప్లాస్టిక్ డీగ్రేడ్ అవుతుంది.

ముందుగా జాన్జి.. డీహైడ్రేట్ అయిన కార్న్‌ను గ్రైండ్ చేసి స్టార్చ్‌గా తయారు చేసి, ఆ తర్వాత దాన్ని కాయిల్‌గా రూపొందిస్తాడు. 3డీ ప్రింటర్ సాయంతో ఆ కాయిల్స్‌తో తన ఉత్పత్తులను డిజైన్ చేస్తాడు. ప్రస్తుతం ఈ బయో ప్లాస్టిక్‌తో టేబుల్స్, చెయిర్స్ రూపొందిస్తున్నాడు. ‘అందరూ నా ఉత్పత్తులను చూసి మెచ్చుకుంటున్నారు. అయితే.. కస్టమర్ల కోసం ఆర్టస్టులు ఏదైనా ప్రొడక్ట్ డిజైన్ చేస్తున్నప్పుడు వేస్ట్‌ను ఎలా తగ్గించాలో తప్పకుండా ఆలోచన చేయాలి. పర్యావరణహితంగా నేను చేస్తున్న పని.. పదిమందికి స్ఫూర్తిగా నిలుస్తుందని భావిస్తున్నాను’ అని యు అంటున్నాడు. 2018లో సౌత్ కొరియాలో 8.2 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వేస్ట్‌ డంప్ చేశారు.

Tags:    

Similar News