‘కేసీఆర్ కిట్’కు నిధుల విడుదల..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మహిళల కాన్పుల సంఖ్య పెరిగేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కేసీఆర్ కిట్ పథకం విజయవంతమైంది. మగబిడ్డ పుడితే రూ.12వేలు ఆడ్డబిడ్డ పుడితే రూ.13వేలతో పాటు పుట్టిన బిడ్డకు మూడు నెలలపాటు అవసరమైన శానీటరీ ప్యాడ్స్, బేబీ సోప్స్, ఆయిల్ ఇతర వస్తువులను కూడా సూట్‌కేసు రూపంలో ఈ పథకం కింద ప్రభుత్వం అర్హులకు అందజేస్తుంది. అయితే కొన్ని నెలలుగా ఈ పథకానికి నిధుల కొరత తీవ్రంగా వేధిస్తుంది. దీంతో […]
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మహిళల కాన్పుల సంఖ్య పెరిగేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కేసీఆర్ కిట్ పథకం విజయవంతమైంది. మగబిడ్డ పుడితే రూ.12వేలు ఆడ్డబిడ్డ పుడితే రూ.13వేలతో పాటు పుట్టిన బిడ్డకు మూడు నెలలపాటు అవసరమైన శానీటరీ ప్యాడ్స్, బేబీ సోప్స్, ఆయిల్ ఇతర వస్తువులను కూడా సూట్‌కేసు రూపంలో ఈ పథకం కింద ప్రభుత్వం అర్హులకు అందజేస్తుంది. అయితే కొన్ని నెలలుగా ఈ పథకానికి నిధుల కొరత తీవ్రంగా వేధిస్తుంది. దీంతో చాలా మంది మహిళలు డెలీవరీ అయ్యాక కేసీఆర్ కిట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. కొన్ని నెలల నిరీక్షణ తర్వాత వారికి ఈ కిట్ కింద వచ్చే నగదు ప్రోత్సాహకం, కిట్లను అందజేసేందుకు ప్రభుత్వం 105.25కోట్లను విడుదల జేసింది. ఆ నిధుల విడుదలకు ఆరోగ్యశాఖ కూడా ఆమోదం తెలిపింది.