ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఫుల్ సాలరీస్

దిశ, ఏపీబ్యూరో: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి జీతాలు ఇచ్చేందుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మే నెల పూర్తి జీతాలు ఇవ్వాలని ఫైనాన్స్, ట్రెజరీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ట్రెజరీ సాఫ్ట్‌వేర్‌లో సీఎఫ్‌ఎంఎస్ మార్పులు చేయనుంది. గడిచిన రెండు నెలల బకాయిలపై కూడా త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. కరోనా ఎఫెక్ట్ కారణంగా ఆర్థిక సమస్యలను దృష్టిలో ఉంచుకున్న ఏపీ సర్కార్ మార్చి, ఏప్రిల్ జీతాల్లో 50 శాతం కోత విధించిన సంగతి […]

Update: 2020-05-21 05:34 GMT

దిశ, ఏపీబ్యూరో: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి జీతాలు ఇచ్చేందుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మే నెల పూర్తి జీతాలు ఇవ్వాలని ఫైనాన్స్, ట్రెజరీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ట్రెజరీ సాఫ్ట్‌వేర్‌లో సీఎఫ్‌ఎంఎస్ మార్పులు చేయనుంది. గడిచిన రెండు నెలల బకాయిలపై కూడా త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. కరోనా ఎఫెక్ట్ కారణంగా ఆర్థిక సమస్యలను దృష్టిలో ఉంచుకున్న ఏపీ సర్కార్ మార్చి, ఏప్రిల్ జీతాల్లో 50 శాతం కోత విధించిన సంగతి తెలిసిందే. అయితే, మే నెల జీతాన్ని మాత్రం పూర్తిగా అందిస్తామని.. ఉద్యోగులకు తీపి కబురు అందించింది.

Tags:    

Similar News