వికారాబాద్‌లో వరుణుడి ప్రతాపం.. ఇళ్లన్నీ జలమయం
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలతో పాటు హైదరాబాద్ మహానగరంలోనూ నిన్న జోరుగా వర్షం కురిసింది. అయితే, నగరాన్ని ఆనుకొని ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో వరుణుడు బీభత్సం సృష్టించాడు. ఒక్కసారిగా కుండపోత వర్షం పడటంతో పలు చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. ఇళ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో ప్రజలు రాత్రంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇంట్లోకి నీరు చేరడంతో వస్తువులు మొత్తం తడిచిపోయాయి. రాత్రంతా నీరు ఇంట్లోకి వస్తుండటంతో ఎప్పుడు ఏం […]
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలతో పాటు హైదరాబాద్ మహానగరంలోనూ నిన్న జోరుగా వర్షం కురిసింది. అయితే, నగరాన్ని ఆనుకొని ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో వరుణుడు బీభత్సం సృష్టించాడు. ఒక్కసారిగా కుండపోత వర్షం పడటంతో పలు చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. ఇళ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో ప్రజలు రాత్రంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇంట్లోకి నీరు చేరడంతో వస్తువులు మొత్తం తడిచిపోయాయి.
రాత్రంతా నీరు ఇంట్లోకి వస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని జనాలు నిద్రపోకుండా జాగారం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా బీసీ కాలనీలో నడిచేందుకు వీలు లేకుండా వరద నీరు నిండిపోయింది. డ్రైనేజీలు జామ్ అవడంతో రోడ్లపైనే వరదంతా నిలిచిపోయింది. తాండూరు-హైదరాబాద్ మార్గంలోని కందవెల్లి వద్ద రోడ్డు కొట్టుకుని పోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు సమాచారం.