ఈ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు..

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తన ద్రోణితో పాటు బంగాళఖాతంలో అల్పపీడన ప్రభావం వల్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ, రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్లా, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, భద్రాద్రి […]

Update: 2020-08-19 10:17 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తన ద్రోణితో పాటు బంగాళఖాతంలో అల్పపీడన ప్రభావం వల్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ, రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

ముఖ్యంగా రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్లా, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, శుక్రవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News