అల్పపీడన ద్రోణి.. ఏపీకి భారీ వర్ష సూచన

దిశ, వెబ్‌డెస్క్ : అరేబియా సముద్రంలో అల్పపీడన ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. దీంతో నేడు, రేపు ఏపీలోని పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం గురువారం ప్రకటించింది. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. గంటకు 30-40కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతవరణశాఖ పేర్కొంది. దీంతో […]

Update: 2021-04-15 06:26 GMT

దిశ, వెబ్‌డెస్క్ : అరేబియా సముద్రంలో అల్పపీడన ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. దీంతో నేడు, రేపు ఏపీలోని పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం గురువారం ప్రకటించింది.

ముఖ్యంగా ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. గంటకు 30-40కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతవరణశాఖ పేర్కొంది. దీంతో తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముందస్తు హెచ్చరికలు జారీచేసింది.

Tags:    

Similar News