వీగన్ ప్రొడక్ట్స్‌కు కొత్త లోగో!
దిశ, ఫీచర్స్ : పాండమిక్ తర్వాత ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ఈ క్రమంలోనే హెల్తీ డైట్ తీసుకోవడంతో పాటు, శాకాహారానికే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అంతేకాదు వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ కాకుండా ‘వీగన్స్’గా మారడం వల్ల మెరుగైన ఆరోగ్య ఫలితాలుంటాయని ప్రచారం జరుగుతోంది. దాంతో కామన్ మ్యాన్ నుంచి సెలెబ్రిటీల వరకు చాలా మంది ఇప్పుడు ‘వీగన్’గా మారుతున్నారు. ఇదో ట్రెండ్‌లాగా సాగుతోంది. కానీ వీగన్ ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని ఇప్పటి వరకు […]
దిశ, ఫీచర్స్ : పాండమిక్ తర్వాత ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ఈ క్రమంలోనే హెల్తీ డైట్ తీసుకోవడంతో పాటు, శాకాహారానికే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అంతేకాదు వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ కాకుండా ‘వీగన్స్’గా మారడం వల్ల మెరుగైన ఆరోగ్య ఫలితాలుంటాయని ప్రచారం జరుగుతోంది. దాంతో కామన్ మ్యాన్ నుంచి సెలెబ్రిటీల వరకు చాలా మంది ఇప్పుడు ‘వీగన్’గా మారుతున్నారు. ఇదో ట్రెండ్‌లాగా సాగుతోంది. కానీ వీగన్ ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని ఇప్పటి వరకు ఎలాంటి శాస్త్రీయ ఆధారమైతే లేదు. కానీ ‘వీగనిజా’నికి పెరుగుతున్న ఆదరణ పరిగణనలోకి తీసుకున్న ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’(ఎఫ్ఎస్ఎస్ఏఐ) వీగన్ ప్రొడక్ట్స్ కోసం కొత్త లోగోను ప్రవేశపెట్టింది.
నాన్-వెగాన్ ఆహారాల నుంచి సులభంగా గుర్తించడానికి, వాటి నుంచి వేరు చేయడానికి వినియోగదారులకు కొత్త లోగో సహాయపడుతుంది. గ్రీన్ కలర్‌లో ఉన్న ఈ లోగోలో ‘V’ అనే అక్షరంతో పాటు, దాని పైన ఓ చిన్న మొక్క, దిగువన ‘వీగన్’ అని రాసి ఉంది. ఇందులోని ప్లాంట్ ‘ప్రొడక్ట్ ఆర్జిన్‌ను తెలియజేస్తే, ‘వి’ అక్షరం వీగనిజానికి సింబల్ అయితే, వీగన్ అనే పదాలు కస్టమర్ కన్‌ఫ్యూజన్ తీర్చడానికి, ఈజీగా ప్రొడక్ట్స్ గుర్తించడానికి సాయపడుతుంది. లోగోను ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్‌లో మాస్టర్స్ చేస్తున్న బెంగళూరు మౌంట్ కారామెల్ కాలేజీకి చెందిన కృతీ మనీష్ రాథోర్ అభివృద్ధి చేశాడు.
‘ఇప్పటికే శాఖాహార (గ్రీన్ డాట్) మాంసాహార (బ్రౌన్ డాట్) లోగోలు ఉన్నాయి. ఇటీవల కాలంలో వీగనిజం వైపు ప్రజలు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. మేము వారికోసం ప్రత్యేకంగా లోగో అందించాం. ఇది వీగన్ ప్రొడక్ట్స్ త్వరగా, సులభంగా గుర్తించేందుకు ఉపయోగపడుతుంది’
– అరుణ్ సింఘాల్, FSSAI CEO