బిగ్ బ్రేకింగ్: ఇకపై ఆ జాతీయ పరీక్షలు ప్రాంతీయ భాషల్లోనే

దిశ, డైనమిక్ బ్యూరో : జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షలను ఇప్పటి వరకూ హిందీ, ఇంగ్లీష్ భాషల్లోనే నిర్వహించేవారు. అయితే, ప్రభుత్వ బ్యాంకుల్లో కొలువుల కోసం ఎంతో మంది పరీక్షలు రాస్తుంటారు. దేశవ్యాప్తంగా జరిగే ఈ పరీక్షకు సంబంధించి ప్రాంతీయ భాషల్లోనూ ప్రశ్నా పత్రాలుండాలన్న డిమాండ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇకపై ప్రకటించే నోటిఫికేషన్లకు సంబంధించి ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు […]

Update: 2021-09-30 07:08 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షలను ఇప్పటి వరకూ హిందీ, ఇంగ్లీష్ భాషల్లోనే నిర్వహించేవారు. అయితే, ప్రభుత్వ బ్యాంకుల్లో కొలువుల కోసం ఎంతో మంది పరీక్షలు రాస్తుంటారు. దేశవ్యాప్తంగా జరిగే ఈ పరీక్షకు సంబంధించి ప్రాంతీయ భాషల్లోనూ ప్రశ్నా పత్రాలుండాలన్న డిమాండ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇకపై ప్రకటించే నోటిఫికేషన్లకు సంబంధించి ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు పరీక్షలను ఇంగ్లీష్ , హిందీతో పాటు 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించేందుకు సిఫార్సు చేసింది.

ప్రాంతీయ భాషలలో ప్రభుత్వ రంగ బ్యాంకులలో (PSB లు) క్లరికల్ క్యాడర్ కోసం నిర్వహించే పరీక్షలపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సుపై ఆర్థిక శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో తెలిపారు. ఈ నిర్ణయానికి ముఖ్య కారణం.. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు ప్రాంతీయ భాషల ద్వారా బ్యాంకుకు వచ్చిన కస్టమర్లకు మరింత సేవ అందించగలుగుతారని పేర్కొన్నారు. అయితే ఆర్థిక శాఖ తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో ఎస్బీఐ నిర్వహించే క్లరికల్ పరీక్షలకు కూడా వర్తిస్తుందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News