వర్చువల్ వైన్ టేస్టింగ్ ట్రెండ్

దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్ విధించి అప్పుడే నెల దాటిపోయింది. మనదేశంలోనే కాదు చాలా దేశాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. నెల రోజుల నుంచి మందుబాబులు మందు దొరక్క విలవిల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాలిఫోర్నియా నుంచి ఎడిన్ బర్గ్ వరకు ‘వర్చువల్ వైన్ టేస్టింగ్ ట్రెండ్’ వైరల్‌గా మారింది. వర్చువల్ వైన్ టేస్టింగా? అసలు ఈ పదం ఎప్పుడైనా విన్నారా? లేదు కదూ! అయితే చలో మేరా సాథ్.. అదేంటో తెలుసుకుందాం. కాలిఫోర్నియాలో ప్రస్తుతం వైనరీ టేస్టింగ్ రూమ్స్ […]

Update: 2020-04-24 03:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్ విధించి అప్పుడే నెల దాటిపోయింది. మనదేశంలోనే కాదు చాలా దేశాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. నెల రోజుల నుంచి మందుబాబులు మందు దొరక్క విలవిల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాలిఫోర్నియా నుంచి ఎడిన్ బర్గ్ వరకు ‘వర్చువల్ వైన్ టేస్టింగ్ ట్రెండ్’ వైరల్‌గా మారింది. వర్చువల్ వైన్ టేస్టింగా? అసలు ఈ పదం ఎప్పుడైనా విన్నారా? లేదు కదూ! అయితే చలో మేరా సాథ్.. అదేంటో తెలుసుకుందాం.

కాలిఫోర్నియాలో ప్రస్తుతం వైనరీ టేస్టింగ్ రూమ్స్ ని కరోనా కారణంగా తాత్కాలికంగా మూసివేశారు. అందువల్ల వైన్ లవర్స్ కి, తమ ఫేవరేట్ బాటిల్‌కి మధ్య దూరం పెరిగిపోయింది. వైన్ లవర్స్‌తో వైన్ ని చేరువ చేసే పనిలో పడ్డారు కాలిఫోర్నియా వైన్ మేకర్స్. అందుకోసం టెక్నాలజీని వాడుకుంటున్నారు. వెబ్‌లో సెమినార్స్, లైవ్ టేస్టింగ్స్, కుకింగ్ క్లాసెస్‌తో వినియోగదారులతో కనెక్ట్ అవుతున్నారు. డిస్కవర్ కాలిఫోర్నియా వైన్స్ నిర్వాహకులు మొత్తంగా 80 రకాల వర్చువల్ వైన్స్ ని అందుబాటులో ఉంచారు.

లాక్‌డౌన్ కారణంగా పాఠశాలలు మూతపడ్డాయి. జిమ్ , యోగా కేంద్రాలకు తాళాలు వేశారు. సినిమా హాళ్లు కూడా బంద్ చేశారు. వీటన్నింటిని ప్రజలందరికీ చేరువ చేసింది ఇంటర్నెట్. ఆన్‌లైన్ క్లాసులతో, లైవ్ జిమ్ ట్రైనింగ్‌లతో అవన్నీ బాగానే రన్ అవుతున్నాయి. ఇప్పుడు వైన్ లవర్స్ కోసం.. వైన్ మేకర్స్ ఆన్‌లైన్ బాట పట్టారు. ఒక్క కాలిఫోర్నియాలోనే కాదు.. చాలా ప్రదేశాల్లో ఆన్‌లైన్ వైన్ ఈవెంట్స్‌ని కండక్ట్ చేస్తున్నారు. మందుబాబులు కూడా ఈ తరహా ప్రయోగాన్ని ఆహ్వానిస్తున్నారు. న్యూ సౌత్ వేల్స్, ఎడిన్‌బర్గ్‌లలో కూడా వైన్ టేస్టింగ్ క్లాసులు నిర్వహిస్తున్నారు. తమ స్థానానికి వినియోగదారుల కోసం ఇలాంటి ఆలోచన చేశామని వైన్ మేకర్స్ చెబుతున్నారు. నాపా, సోనోమా, మేరిలాండ్, ఓరేగాన్, న్యూయార్క్ లలో కూడా ఇదే మార్గాన్ని ఎంచుకున్నారు.

tags :coronavirus, lockdown, virtual wine tasting, california

Tags:    

Similar News