శుక్రవారం రంగనాయకసాగర్ ప్రారంభోత్సవం
దిశ, మెదక్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో నిర్మించిన రంగనాయకసాగర్ రిజర్వాయర్‌ను శుక్రవారం ప్రారంభించనున్నారు. సుమారు 3 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ రిజర్వాయర్ ద్వారా సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లోని సుమారు 1.10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఇప్పటికే అనంతగిరి (అన్నపూర్ణ) రిజర్వాయర్ నుంచి సొరంగమార్గం ద్వారా రంగనాయకసాగర్ సర్జ్‌పూల్‌కు గోదావరి జలాలు చేరుకున్నాయి. ఇక్కడి నుంచి 4 మోటార్ల ద్వారా రంగనాయకసాగర్ రిజర్వాయర్‌లోకి […]
దిశ, మెదక్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో నిర్మించిన రంగనాయకసాగర్ రిజర్వాయర్‌ను శుక్రవారం ప్రారంభించనున్నారు. సుమారు 3 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ రిజర్వాయర్ ద్వారా సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లోని సుమారు 1.10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఇప్పటికే అనంతగిరి (అన్నపూర్ణ) రిజర్వాయర్ నుంచి సొరంగమార్గం ద్వారా రంగనాయకసాగర్ సర్జ్‌పూల్‌కు గోదావరి జలాలు చేరుకున్నాయి. ఇక్కడి నుంచి 4 మోటార్ల ద్వారా రంగనాయకసాగర్ రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోయనున్నారు. అయితే కరోనా నేపథ్యంలో ఎలాంటి హడావుడి లేకుండానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఐదు రోజులుగా మంత్రి హరీశ్ రావు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. సముద్ర మట్టానికి 490 మీటర్ల ఎత్తులో ఈ రిజర్వాయర్ ఉంది. ఇక్కడి నుంచి గజ్వేల్ నియోజకవర్గంలో నిర్మించిన కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌కు నీటిని తరలించడానికి శ్రీకారం చుట్టనున్నారు.
Tag: ranganayakasagar, opening, friday, medak, ts news