‘మేమున్నాం..’ భారత్‌ను అన్ని విధాలా ఆదుకుంటాం
న్యూఢిల్లీ: కొవిడ్‌పై పోరులో భారత్‌కు తాము అన్ని విధాలుగా అండగా ఉన్నామని ఫ్రాన్స్ ప్రకటించింది. దేశానికి ఎటువంటి సాయం అందించడానికైనా తాము సిద్దంగా ఉన్నామని సంఘీబావం తెలిపింది. భారత్‌లో వరుసగా రెండో రోజూ 3 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్ మాక్రన్ భారత్‌కు ఒక సందేశాన్ని పంపారు. ఫ్రాన్స్ రాయబారి ఎమ్మాన్యుయల్ లెనైన్.. అధ్యక్షుడి సందేశాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘కొవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న భారత ప్రజలకు నేను ఒక […]
న్యూఢిల్లీ: కొవిడ్‌పై పోరులో భారత్‌కు తాము అన్ని విధాలుగా అండగా ఉన్నామని ఫ్రాన్స్ ప్రకటించింది. దేశానికి ఎటువంటి సాయం అందించడానికైనా తాము సిద్దంగా ఉన్నామని సంఘీబావం తెలిపింది. భారత్‌లో వరుసగా రెండో రోజూ 3 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్ మాక్రన్ భారత్‌కు ఒక సందేశాన్ని పంపారు. ఫ్రాన్స్ రాయబారి ఎమ్మాన్యుయల్ లెనైన్.. అధ్యక్షుడి సందేశాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘కొవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న భారత ప్రజలకు నేను ఒక సందేశమివ్వాలనుకుంటున్నాను. ఈ పోరాటంలో మీకు తోడుగా మేమున్నాం. ఏ రకమైన సాయమైనా అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం..’ అని మాక్రన్ సందేశాన్ని లెనైన్ ట్వీట్ చేశారు. దేశంలో కరోనా పెరుగుదలతో అమెరికా, బ్రిటన్ సహా పలు అరబ్ దేశాలు భారత్‌ను రెడ్ లిస్ట్‌లో పెట్టడమో.. ఇక్కడి నుంచి వెళ్లే విమానాలపై నిషేధం విధిస్తున్న వేళ.. ఫ్రాన్స్ మనకు అండగా నిలవడం గమనార్హం.