డీఏ నిలుపుదలపై మాజీ ప్రధాని స్పందన
న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం కారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులకు ఇటీవలే పెంచిన కరువు భత్యాన్ని(డీఏ) నిలిపివేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇలాంటి కష్టకాలంలో ప్రభుత్వోదోగుల డీఏను నిలిపివేసి, వారిపై భారం వేయడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. అలాగే, రాహుల్ గాంధీ సైతం స్పందిస్తూ.. మధ్యతరగతి కుటుంబాల నుంచి డబ్బులు వసూలు చేస్తూ.. వాటిని పేదలకు కాకుండా సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ నిమిత్తమై ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. […]
న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం కారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులకు ఇటీవలే పెంచిన కరువు భత్యాన్ని(డీఏ) నిలిపివేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇలాంటి కష్టకాలంలో ప్రభుత్వోదోగుల డీఏను నిలిపివేసి, వారిపై భారం వేయడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. అలాగే, రాహుల్ గాంధీ సైతం స్పందిస్తూ.. మధ్యతరగతి కుటుంబాల నుంచి డబ్బులు వసూలు చేస్తూ.. వాటిని పేదలకు కాకుండా సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ నిమిత్తమై ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. కాగా, కరోనా వల్ల నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో ఆర్థికభారం తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2021 జులై వరకు పెంచిన డీఏ చెల్లింపులను నిలిపివేస్తున్నట్టు ఆర్థికశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం 50 లక్షల మంది ఉద్యోగులు, 61 లక్షల మంది పింఛన్‌దారులపై ప్రభావం పడనుంది.
Tags: dearness allowance, freezing da, manmohan singh, rahul gandhi, corona, covid 19, congress