జర్నలిస్టుల కోసం ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం..

దిశ, వెబ్‌డెస్క్ : దేశరాజధాని ఢిల్లీలో కరోనా ఉపద్రవం విరుచుకుపడుతూనే ఉంది. ప్రస్తుతం అక్కడ రెండు వారాలుగా లాక్‌డౌన్ కొనసాగుతున్న కేసుల సంఖ్య మాత్రం ఎక్కువగానే ఉంది. గతంలో కంటే సెకండ్ వేవ్‌లో కరోనా మరణాలు రెట్టింపు సంఖ్యలో పెరిగాయి. ముఖ్యంగా ఆక్సిజన్ కొరత వలన దేశ రాజధానిలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. అయితే, కొవిడ్ సమయంలోనూ ధైర్యంగా తమ ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టుల కోసం కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. […]

Update: 2021-05-07 11:12 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశరాజధాని ఢిల్లీలో కరోనా ఉపద్రవం విరుచుకుపడుతూనే ఉంది. ప్రస్తుతం అక్కడ రెండు వారాలుగా లాక్‌డౌన్ కొనసాగుతున్న కేసుల సంఖ్య మాత్రం ఎక్కువగానే ఉంది. గతంలో కంటే సెకండ్ వేవ్‌లో కరోనా మరణాలు రెట్టింపు సంఖ్యలో పెరిగాయి. ముఖ్యంగా ఆక్సిజన్ కొరత వలన దేశ రాజధానిలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది.

అయితే, కొవిడ్ సమయంలోనూ ధైర్యంగా తమ ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టుల కోసం కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మీడియా ప్రతినిధులకు ఫ్రీ వ్యాక్సినేషన్ ఇవ్వనున్నట్లు ఆప్ సర్కార్ శుక్రవారం ప్రకటించింది. వ్యాక్సిన్ ఖర్చు సైతం ప్రభుత్వమే భరిస్తుందని తెలిపింది. కాగా, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈనిర్ణయం తీసుకోవడం పట్ల జర్నలిస్టు మిత్రులు హర్షం వ్యక్తంచేశారు.

Tags:    

Similar News