వ్యాక్సిన్ వేసుకుంటే కిలో టొమాటోలు ఫ్రీ..
రాయ్‌పూర్ : కరోనా నివారణకు ప్రస్తుతం వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని భావిస్తున్న ప్రభుత్వాలు విరివిగా టీకా కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు అందజేస్తున్నాయి. అయితే వైరస్ విజృంభిస్తున్నా.. ప్రభుత్వం ఎంత ప్రచారం చేస్తున్నా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు ఇప్పటికీ వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. ఛత్తీస్‌గఢ్ వంటి గిరిజనం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. అయితే దీనిని అధిగమించడానికి అక్కడి వైద్య సిబ్బంది కొత్త ఆలోచన చేశారు. వ్యాక్సిన్ వేసుకున్నవారికి కిలో […]
రాయ్‌పూర్ : కరోనా నివారణకు ప్రస్తుతం వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని భావిస్తున్న ప్రభుత్వాలు విరివిగా టీకా కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు అందజేస్తున్నాయి. అయితే వైరస్ విజృంభిస్తున్నా.. ప్రభుత్వం ఎంత ప్రచారం చేస్తున్నా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు ఇప్పటికీ వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. ఛత్తీస్‌గఢ్ వంటి గిరిజనం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. అయితే దీనిని అధిగమించడానికి అక్కడి వైద్య సిబ్బంది కొత్త ఆలోచన చేశారు. వ్యాక్సిన్ వేసుకున్నవారికి కిలో టమాటోలను ఉచితంగా అందిస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా మారుమూల ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలకు టీకా వేసిన తర్వాత టమాటోలు, ఇతర కూరగాయలు అందిస్తున్నారు. తద్వారా ప్రజల్లో కరోనా వ్యాక్సిన్ పై అవగాహన కల్పిస్తూ.. వారిని టీకా వేసుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారు. ఇందుకు గాను స్థానిక కూరగాయలు అమ్మే వ్యక్తుల నుంచి వెజిటేబుల్స్ కొని మరీ టీకా కేంద్రాలకు వచ్చిన వారికి అందజేస్తున్నారు. ఇది సక్సెస్ కావడంతో ఎక్కువ మందికి వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుందని బీజాపూర్ మున్సిపాలిటీ పరిధిలో వ్యాక్సిన్ కేంద్రం నిర్వహిస్తున్న పురుషోత్తం తెలిపారు. పురుషోత్తం చేసిన పనికి సోషల్ మీడియాలో ప్రశంసలు దక్కుతున్నాయి.