ఉచితంగా నెట్‌ప్లిక్స్ స్ట్రీమింగ్ ఫెస్ట్..!

దిశ, వెబ్‌డెస్క్ : ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ సంస్థ నెట్‌ప్లిక్స్ ఇండియాలో ఉచితంగా స్ట్రీమింగ్ ఫెస్ట్‌ను ప్రారంభించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దానిలో భాగంగానే డిసెంబర్ నెల తొలి వారాంతంలో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ లేని వాళ్లందరికీ ఉచితంగా సినిమాలను చూసే అవకాశాన్ని కల్పించనుంది. తమ ఫ్లాట్‌ఫాంలో ఎటువంటి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రదర్శిస్తామో వినియోగదారులందరికీ తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. గతంలో 30 రోజుల ఫ్రీ ట్రయల్‌ను అందించిన నెట్‌ఫ్లిక్స్ ప్రస్తుతం ఆ ఆప్షన్‌ను తొలగించింది. […]

Update: 2020-10-21 10:35 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ సంస్థ నెట్‌ప్లిక్స్ ఇండియాలో ఉచితంగా స్ట్రీమింగ్ ఫెస్ట్‌ను ప్రారంభించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దానిలో భాగంగానే డిసెంబర్ నెల తొలి వారాంతంలో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ లేని వాళ్లందరికీ ఉచితంగా సినిమాలను చూసే అవకాశాన్ని కల్పించనుంది. తమ ఫ్లాట్‌ఫాంలో ఎటువంటి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రదర్శిస్తామో వినియోగదారులందరికీ తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.

గతంలో 30 రోజుల ఫ్రీ ట్రయల్‌ను అందించిన నెట్‌ఫ్లిక్స్ ప్రస్తుతం ఆ ఆప్షన్‌ను తొలగించింది. కాగా, ఉచిత స్ట్రీమింగ్ ఫెస్ట్‌ వినియోగదారులకు ఎన్నిరోజుల వరకు అందించనున్నారో ఆ సంస్థ పేర్కొనలేదు.

Tags:    

Similar News