అమెజాన్ ఫ్రీ గిప్ట్స్ నిజమేనా?

దిశ, ఫీచర్స్ : ‘ఉచితం’ అంటే చాలు.. వెనకా ముందు ఆలోచించకుండా పరుగులు పెడతాం. అదే వెబ్ లింక్ రూపంలో వస్తే వెంటనే దాన్ని ఓపెన్ చేసేస్తాం. ఈ తొందరపాటునే సైబర్ నేరగాళ్లు తమకు అవకాశంగా మలుచుకుంటున్నారు. ఇటీవలే మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు అడిడాస్ ఫ్రీ షూస్ అందిస్తుందంటూ ఓ వెబ్ లింక్.. వాట్సాప్, ఇతర సోషల్ మీడియా సైట్స్‌లో విపరీతంగా సర్క్యులేట్ అయింది. అది ఫేక్ ఆఫర్ కాగా, తాజాగా అమెజాన్ 30వ వార్షికోత్సవం […]

Update: 2021-03-25 09:11 GMT

దిశ, ఫీచర్స్ : ‘ఉచితం’ అంటే చాలు.. వెనకా ముందు ఆలోచించకుండా పరుగులు పెడతాం. అదే వెబ్ లింక్ రూపంలో వస్తే వెంటనే దాన్ని ఓపెన్ చేసేస్తాం. ఈ తొందరపాటునే సైబర్ నేరగాళ్లు తమకు అవకాశంగా మలుచుకుంటున్నారు. ఇటీవలే మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు అడిడాస్ ఫ్రీ షూస్ అందిస్తుందంటూ ఓ వెబ్ లింక్.. వాట్సాప్, ఇతర సోషల్ మీడియా సైట్స్‌లో విపరీతంగా సర్క్యులేట్ అయింది. అది ఫేక్ ఆఫర్ కాగా, తాజాగా అమెజాన్ 30వ వార్షికోత్సవం సందర్భంగా సర్వే నిర్వహిస్తోందని, పాల్గొనేవారికి ‘హువావే మేట్ 40 ప్రో 5జీ’ ఫోన్ ఉచితంగా లభిస్తుందనే వాట్సాప్ మెసేజ్ వాట్సాప్ గ్రూపుల్లో తెగ షేర్ అవుతోంది. ఇది కూడా ఫేక్ మెసేజ్.

‘అమెజాన్ 30వ యానివర్సరీ.. ఫ్రీ గిప్ట్స్ ఫర్ ఎవ్రీ వన్’ అనే లింక్ ఇటీవల కాలంలో ఎక్కువగా షేర్ అవుతోంది. దీన్నీ ఓపెన్ చేయగానే, ఓ సర్వే వస్తుంది. అందులో మీ సెక్స్ ఏంటి, ఏ ఫోన్ వాడుతున్నారు, మీ ఏజ్ గ్రూప్ వంటి వివరాలన్నీ అడుగుతుంది. ఆ వెంటనే మీరు ఉచితంగా గిఫ్ట్స్ గెలుచుకోవాలనుకుంటే 12 బాక్సుల్లో మూడు ఎంచుకోండి! అని కనిపిస్తుంది. ఆ బాక్సులు క్లిక్ చేసిన ప్రతి వారికి కంగ్రాట్స్.. మీరు ‘హువావే మేట్ 40 ప్రో 5జీ’ గెలుచుకున్నారనే మెసేజ్ కనిపిస్తుంది. అయితే అక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది. ఈ లింక్‌ను ఓ పది గ్రూపుల్లో, 20మంది స్నేహితులకు సెండ్ చేయమని సూచిస్తుంది. అంతేకాదు మన అడ్రస్ వివరాలు కూడా ఎంటర్ చేయమంటుంది. అది నిజమేనని భావించి పలువురు ఈ లింకును ఇతరులకు షేర్ చేస్తున్నారు. కానీ ఈ లింక్ ఓపెన్ చేశామో.. మన వ్యక్తిగత వివరాలు మోసగాళ్ల చేతికి చిక్కినట్లే. సర్వే పేరుతో పర్సనల్ విషయాలు తెలుసుకుని భవిష్యత్తులో ఆర్థిక నేరాలకు పాల్పడుతుంటారు. పైగా ఈ లింక్ ఏ ఒక్కరినో నష్టపరచడం లేదు, ఒకరి ద్వారా ఒకరిని బలి చేస్తూ, అందరినీ సైబర్ క్రిమినల్స్ వలలో పడేలా చేస్తోంది.

ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సింది అమెజాన్ 1994లో ప్రారంభమైంది. అంటే 26 సంవత్సరాలైంది. కానీ సైబర్ నేరగాళ్లు తెలివిగా 30 ఏళ్ల సెలబ్రేషన్స్ అని రాసుకొచ్చారు. ఇక ఇందుకు ఉపయోగించిన లోగో కూడా అమెజాన్ వెబ్‌సైట్ తరహాలోనే కనిపిస్తుంది. కానీ దాన్ని పరిశీలిస్తే.. ఫేక్ అని గుర్తుపట్టొచ్చు. ఇక Amazon.xyz అనే యూఆర్‌ఎల్ కూడా అమెజాన్‌కు లేదు. మరొక విషయం అమెజాన్ అనే కాదు, ఏ సంస్థ కూడా ఉచిత గిప్ట్స్ ఇవ్వదు. ఒకవేళ ఇవ్వాలనుకుంటే.. తమ అధికారిక వెబ్‌సైట్‌, పత్రికా ప్రకటనల్లో ఆ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తారు. కాబట్టి.. ఇలాంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి.

Tags:    

Similar News