సువర్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత భోజనం

దిశ, హైదరాబాద్ : కరోనా వైరస్ ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ చేసిన నేపథ్యంలో అనాథలు, వృద్ధులు, పేదలు, వికలాంగులకు ఉచితంగా ఆహారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ‘సువర్ణ ఫౌండేషన్’ నిర్వాకులు రాజేష్ తెలిపారు. పద్మారావునగర్, ముషీరాబాద్, గాంధీనగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, విద్యానగర్, నల్లకుంట, రాంనగర్, నారాయణగూడ, హిమాయత్ నగర్ ప్రాంతాల్లోని పేదలకు, అనాథలకు, వికలాంగులకు అందిస్తామన్నారు. నగరంలోని కార్ఖానా సర్వ్ నీడీ అనాథ ఆశ్రమం, ఓల్డ్ ఏజ్ హోంలో నిత్యావసర వస్తువులు లేక […]

Update: 2020-03-31 08:31 GMT

దిశ, హైదరాబాద్ :

కరోనా వైరస్ ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ చేసిన నేపథ్యంలో అనాథలు, వృద్ధులు, పేదలు, వికలాంగులకు ఉచితంగా ఆహారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ‘సువర్ణ ఫౌండేషన్’ నిర్వాకులు రాజేష్ తెలిపారు. పద్మారావునగర్, ముషీరాబాద్, గాంధీనగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, విద్యానగర్, నల్లకుంట, రాంనగర్, నారాయణగూడ, హిమాయత్ నగర్ ప్రాంతాల్లోని పేదలకు, అనాథలకు, వికలాంగులకు అందిస్తామన్నారు. నగరంలోని కార్ఖానా సర్వ్ నీడీ అనాథ ఆశ్రమం, ఓల్డ్ ఏజ్ హోంలో నిత్యావసర వస్తువులు లేక ఇబ్బందులు పడుతున్న విషయాలను మీడియా ద్వారా తెలుసుకుని అక్కడ నెల రోజులకు సరిపడా సామగ్రిని రాజేష్ అందజేశారు. మతాలకు అతీతంగా ఈ భోజనం ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. అవసరమైన వారు 8897 292 469 నంబర్‌కు కాల్ చేయాలని ఫౌండేషన్ నిర్వాకులు రాజేష్ తెలిపారు.

Tags: Corona Effect, Suvarna Foundation, Old Age Home

Tags:    

Similar News