మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐ పెట్టుబడులు వెనక్కి
దిశ, వెబ్‌డెస్క్: రూపాయి మారకం విలువ క్షీణత, అంతర్జాతీయ మార్కెట్ల పరిణామాల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు(ఎఫ్‌పీఐ) విక్రయాలను క్రమంగా పెంచుతున్నారు. అమ్మకాల ఒత్తిడి కొనసాగుతుండటంతో ఈ నెలలో ఇప్పటివరకు రూ. 1,472 కోట్లను ఉపసంహరించుకున్నారు. డిపాజిటరీ గణాంకాల ప్రకారం.. ప్రస్తుత నెలలో ఇప్పటివరకు ఎఫ్‌పీఐ నికరంగా విక్రయాలకు సిద్ధమవుతున్నారు. అక్టోబర్ నెలకు సంబంధించి రుణ విభాగంలో వెనక్కి మళ్లుతున్నాయి. అంతకుముందు రెండు నెలలుగా భారీ ఎత్తున కొనుగోళ్లు జరిగాయి. సెప్టెంబర్‌లో ఎఫ్‌పీఐలు […]
దిశ, వెబ్‌డెస్క్: రూపాయి మారకం విలువ క్షీణత, అంతర్జాతీయ మార్కెట్ల పరిణామాల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు(ఎఫ్‌పీఐ) విక్రయాలను క్రమంగా పెంచుతున్నారు. అమ్మకాల ఒత్తిడి కొనసాగుతుండటంతో ఈ నెలలో ఇప్పటివరకు రూ. 1,472 కోట్లను ఉపసంహరించుకున్నారు. డిపాజిటరీ గణాంకాల ప్రకారం.. ప్రస్తుత నెలలో ఇప్పటివరకు ఎఫ్‌పీఐ నికరంగా విక్రయాలకు సిద్ధమవుతున్నారు. అక్టోబర్ నెలకు సంబంధించి రుణ విభాగంలో వెనక్కి మళ్లుతున్నాయి. అంతకుముందు రెండు నెలలుగా భారీ ఎత్తున కొనుగోళ్లు జరిగాయి. సెప్టెంబర్‌లో ఎఫ్‌పీఐలు రూ. 13,363 కోట్లు కాగా, అంతకుముందు ఆగస్టులో రూ. 14,376.2 కోట్ల పెట్టుబడులు పెట్టారు. అయితే, అక్టోబర్‌లో ఇప్పటివరకు రూ. 1,698 కోట్ల ఎఫ్‌పీఐలను ఉపసంహరించుకున్నారు. ఈక్విటీలలో నికర ప్రాతిపదికన రూ. 226 కోట్ల ఎఫ్‌పీఐలను పెట్టుబడులుగా పెట్టారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో కొనసాగుతున్న ప్రతికూల పరిస్థితుల కారణంగా లాభాల స్వీకరణకు ఎఫ్‌పీఐలు ఆసక్తి చూపిస్తున్నారని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.